అంతేకాకుండా కృష్ణం రాజు ముగ్గురు కూతుళ్లు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తిలపై ప్రభాస్ కు ఎనలేని ప్రేమ చూపిస్తుంటాడంట. ఎంతటి బిజీ షెడ్యూల్ లోనైనా తమకోసం సమయం కేటాయిస్తాడని, సరదాగా ఉంటారని తెలిపింది. ఒక్కోసారి.. గంట సమయం కేటాయించిన ప్రభాస్.. రోజంతా చెల్లెళ్లతో ముచ్చటించేవారని చెప్పింది. దీంతో ప్రభాస్ తన చెల్లెళ్ల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో అర్థం అవుతోంది. మున్ముందు వారి పెళ్లి కూడా చేయాల్సిన బాధ్యత అన్నయ్య ప్రభాస్ పైనే ఉండటం విశేషం. ఇక ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ (Salaar), ప్రాజెక్ట్ కే (Project K) చిత్రాల్లో నటిస్తున్నారు.