Charan Remuneration: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ మొదటివారంలోనే నిర్వహకులు పెద్ద షాక్ ఇచ్చారు. చరణ్‌ని మిడ్ వీక్‌లోనే ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే. మరి ఆయనకు ఎంత పారితోషికం ముట్టిందనేది చూస్తే..
బిగ్ బాస్ తెలుగు 10లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సీజన్ ప్రారంభమైన కొద్ది రోజులకే ఆర్జే చరణ్ మహదేవ్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. సాధారణంగా ప్రతి వారం వీకెండ్‌లో ఎలిమినేషన్ ఉండే బిగ్ బాస్‌లో.. ఈసారి తొలి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టడం ఆసక్తిని రేకెత్తించింది. హై రిస్క్ జోన్‌లోకి వెళ్లిన చరణ్ మహదేవ్, చివరకు ఇంటి సభ్యుల నిర్ణయంతో హౌజ్‌ను వీడాల్సి వచ్చింది. దీనిపై కామన్ ఆడియెన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇది అన్‌ఫెయిర్ అంటున్నారు. ఆడే ఛాన్స్ ఇవ్వకుండా ఎలా ఎలిమినేట్ చేస్తారనేది విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ జరిగిపోయింది. చరణ్ ఎలిమినేట్ అయ్యాడు.
24
కామనర్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ
చరణ్ విషయానికి వస్తే.. ఆయన బిగ్ బాస్ తెలుగు 10లోకి సెలబ్రిటీ కేటగిరీలో కాకుండా కామనర్‌గా అడుగుపెట్టాడు. బిగ్ బాస్‌లోకి కామనర్లను ఎంపిక చేసేందుకు నిర్వహించిన అగ్నిపరీక్ష ద్వారా చరణ్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆర్జేగా, యాంకర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న చరణ్‌కు బిగ్ బాస్ హౌజ్‌లో ఎక్కువ రోజులు కొనసాగి తన టాలెంట్ చూపించే అవకాశం దక్కుతుందని అభిమానులు భావించారు. అయితే ఊహించని విధంగా తొలి వారంలోనే ఆయన ప్రయాణం ముగిసింది.
34
చరణ్ పారితోషికం
ఇక చరణ్‌కు బిగ్ బాస్ హౌజ్‌లో ఎంత పారితోషికం లభించిందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కామనర్ కంటెస్టెంట్లకు వారానికి సుమారు రూ.70 వేల వరకు పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. ఆర్జే చరణ్‌కు రూ.70 వేల నుంచి రూ.1 లక్ష వరకు వారపు రెమ్యునరేషన్ ఉంటుందని టాక్. అంటే చరణ్ హౌజ్‌లో గడిపిన వ్యవధిని బట్టి అతనికి లభించే మొత్తం మారే అవకాశం ఉంది. మిడ్ వీక్‌లోనే ఎలిమినేట్ కావడంతో పూర్తి వారపు పారితోషికం ఎలా లెక్కిస్తారన్నది మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉంది. వారానికి లెక్క కడితే ఆయనకు దాదాపు 70 వేల వరకు వస్తుంది. రోజులను బట్టి చూస్తే యాభై వేల వరకు అందుతాయని చెప్పొచ్చు.
మరోవైపు బిగ్ బాస్ తెలుగు 10లో సెలబ్రిటీలు, కామనర్ల మధ్య పారితోషికంలో భారీ వ్యత్యాసం ఉంది. జబర్దస్త్ రామ్ ప్రసాద్‌కు వారానికి రూ.4.5 లక్షల వరకు పారితోషికం లభిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారి క్రేజ్, రేంజ్‌ని బట్టిఇస్తున్నారు. మూడు లక్షలు, రెండు లక్షలు తీసుకునే వారు కూడా ఉన్నారు. అదే సమయంలో కామనర్లకు సుమారు రూ.70 వేల వరకు చెల్లిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చరణ్ ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ తెలుగు 10లో తొలి వారం నుంచే గేమ్ మరింత ఆసక్తికరంగా మారింది. అగ్నిపరీక్ష ద్వారా హౌజ్‌లోకి వచ్చిన చరణ్‌కు తక్కువ సమయంలోనే బిగ్ బాస్ అనుభవం ముగిసిపోయింది. అయితే ఈ షో ద్వారా ఆయనకు వచ్చిన గుర్తింపు, ప్రేక్షకుల్లో పెరిగిన క్రేజ్ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు ఉపయోగపడుతుందా అనేది చూడాలి.