Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్

Published : Sep 11, 2026, 11:30 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో గురువారం చరణ్ ఎలిమినేషన్ ని మరిచిపోక ముందే శుక్రవారం మరో ఎలిమినేషన్ జరిగింది. హౌస్ నుంచి చైత్ర రాయ్ ఎలిమినేట్ అయ్యారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
Bigg Boss Telugu 10

బిగ్ బాస్ తెలుగు 10 షోలో శుక్రవారం డే 5న మరో ఎలిమినేషన్ జరిగింది. ఆల్రెడీ చరణ్ ని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు నటి చైత్ర రాయ్ ని కూడా ఎలిమినేట్ చేశారు. చైత్ర రాయ్ హై రిస్క్ జోన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అసలు ఆమె ఎలా ఎలిమినేట్ అయ్యారు ? శుక్రవారం ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు జరిగాయి అనేది ఇప్పుడు చూద్దాం.

25
హార్డ్ టాస్క్, ఈజీ టాస్క్

రామ్ ప్రసాద్ గురువారం రోజు ఎక్కువ మంది ఇంటి సభ్యుల ఓట్లు గెలుచుకున్నారు. దీనితో రామ్ ప్రసాద్ హై రిస్క్ జోన్ నుంచి బయటపడ్డట్లు బిగ్ బాస్ ప్రకటించారు. ఆ తర్వాత హై రిస్క్ నుంచి బయట పడేందుకు, హౌస్ మేట్స్ గా అవకాశం పొందేందుకు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇండివిడ్యువల్ టాస్క్ లు పెట్టారు. వాటిలో హార్డ్ టాస్క్, ఈజీ టాస్క్ రెండు రకాలుగా ఉంటాయి.

35
రామ్ ప్రసాద్ విజయం

హర్డ్ టాస్క్ కోసం సుధీర్, వర్షిణి ఎంపిక అయ్యారు. ఈజీ టాస్క్ లో రామ్ ప్రసాద్, నరేష్ దేబ్జానీ, నరేష్, సృష్టి, అమన్ పాల్గొన్నారు. ఈజీ టాస్క్ ని రన్ రాజా రన్ అనే పేరుతో నిర్వహించారు. ఈ టాస్క్ కి త్రిగుణ్ సంచాలకుడు. ఈ టాస్క్ ప్రకారం విజేత అయితే వాళ్ళు హౌస్ మేట్స్ గా అవకాశం సాధిస్తారు. ఈ టాస్క్ లో చివరికి రాంప్రసాద్, నరేష్ మిగిలారు. రామ్ ప్రసాద్ ముందుగా కర్చీఫ్ ని అందుకుని విజయం సాధించాడు. దీనితో అతడికి హౌస్ మేట్ గా అవకాశం దక్కింది.

45
వర్షిణి, సుధీర్ అట్టర్ ఫ్లాప్

ఇక హార్డ్ టాస్క్ లో సుధీర్, వర్షిణి ఇద్దరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. బిగ్ బాస్ వాళ్ళిద్దరినీ యాక్టివిటీ ఏరియాలోకి పిలిచి ఒక టాస్క్ ఇచ్చారు. గజిబిజిగా ఉన్న కేక్ ని వాళ్లకు ఇచ్చి.. దీనిని మీ ఇద్దరిలో ఒకరు పాడు చేసినట్లు ఇతర కంటెస్టెంట్స్ ని నమ్మించాలి అని చెప్పారు. ఇక్కడ జరిగిన విషయాలు రివీల్ చేయకూడదు అని చెప్పారు. కానీ వాళ్లిద్దరూ ఓవర్ యాక్షన్ చేస్తూ వెళ్లడంతో వీళ్ళు ఏదో దాస్తునట్లు ఇతర సభ్యులకు అర్థం అయింది. వాళ్ళు చెప్పిన విషయాలు ఎవ్వరూ నమ్మలేదు. దీనితో ఈ టాస్క్ లో ఇద్దరూ ఫెయిల్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. ఇద్దరూ హై రిస్క్ లోకి వెళ్లినట్లు అనౌన్స్ చేశారు.

55
బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర అవుట్

వెంటనే బిగ్ బాస్ మరో బాంబ్ పేల్చారు. ప్రస్తుతం హై రిస్క్ లో ఉన్న చైత్ర, వర్షిణి, సుధీర్, అమన్ లలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలిపారు. వీరి నలుగురిలో ఎక్కువ మంది చైత్ర హౌస్ లో వీక్ గా ఉన్నట్లు ఓట్ వేశారు. దీనితో చైత్ర ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ ఊహించని షాక్ ఇచ్చారు. చైత్రని కొందరు కొందరు యమ భటుల గెటప్ లో ఉన్న వాళ్ళు హౌస్ నుంచి బయటకు తీసుకెళ్లారు. వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే ఇద్దరిని తీసుకెళ్లిపోయారు. ఇది అన్యాయం బిగ్ బాస్ అంటూ రామ్ ప్రసాద్ బిగ్ బాస్ ని ప్రశ్నించారు.

Read more Photos on
click me!

Recommended Stories