Tollywood: కిరణ్ అబ్బవరం నుంచి అఖిల్ వరకు, పెళ్లి తర్వాత మాస్ కంబ్యాక్.. చైతు, సమంత ఇద్దరూ భలే లక్కీ

Published : Jul 14, 2026, 09:31 AM IST

కిరణ్ అబ్బవరం నుంచి అఖిల్ అక్కినేని వరకు టాలీవుడ్ యువ హీరోలు పెళ్లి తర్వాత అదిరిపోయే హిట్లతో కంబ్యాక్ ఇచ్చారు. ఆ సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
16
Akhil Akkineni

టాలీవుడ్ లో కొందరు యువ హీరోలకు పెళ్లి బాగా కలసి వచ్చింది. పెళ్ళికి ముందు ఫ్లాపుల్లో ఉన్న హీరోలు పెళ్లి తర్వాత బ్లాక్ బస్టర్ చిత్రాలతో మాస్ మాస్ కంబ్యాక్ ఇచ్చారు. అఖిల్ అక్కినేని, కిరణ్ అబ్బవరం లాంటి యువ హీరోలు ఉన్నారు. వీళ్లంతా ఎలాంటి సినిమాలతో పెళ్లి తర్వాత కంబ్యాక్ ఇచ్చారో చూద్దాం.

26
అఖిల్

అఖిల్ అక్కినేని ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం అఖిల్ నుంచి ఏజెంట్ వరకు అన్నీ ఫ్లాపులే. గతేడాది జైనబ్ అనే తన ప్రియురాలిని అఖిల్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అఖిల్ నుంచి వచ్చిన తొలి చిత్రం లెనిన్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. పెళ్లి తర్వాత అసలు సిసలైన మాస్ కంబ్యాక్ అంటే ఇదే.

36
కిరణ్ అబ్బవరం

మీడియం బడ్జెట్ చిత్రాలతో కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. పెళ్ళికి ముందు కిరణ్ అబ్బవరంకి కొన్ని ఫ్లాపులు ఎదురయ్యాయి. 2024లో కిరణ్ అబ్బవరం నటి రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కిరణ్ నటించిన 'క' అనే చిత్రం సంచలన విజయం సాధించింది.

46
నాగ చైతన్య

నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాలని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సెకండ్ మ్యారేజ్ చైతూకి అదృష్టం తెచ్చిపెట్టింది. శోభితతో పెళ్లి తర్వాత రిలీజ్ అయిన తండేల్ మూవీ సూపర్ హిట్ అయింది.

56
సమంత

సమంతకి కూడా రెండో వివాహం భలే కలసిసొచ్చింది. తన భర్త రాజ్ నిడిమోరు క్రియేటర్ గా, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మా ఇంటి బంగారం చిత్రం ఘనవిజయం సాధించింది. ఏకంగా 100 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ సమంతకి మాస్ కంబ్యాక్ ఇచ్చింది.

66
సుజీత్

హీరోలు, నటీమణులు మాత్రమే కాదు ఓ క్రేజీ దర్శకుడు కూడా పెళ్లి తర్వాత అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు. అతడెవరో కాదు సుజీత్. సాహో లాంటి పాన్ ఇండియా చిత్రం నిరాశ పరిచిన తర్వాత సుజీత్ డీలా పడ్డారు. సాహో మూవీ 2019లో రిలీజ్ అయింది. 2020లో ప్రవల్లిక రెడ్డితో సుజీత్ వివాహం జరిగింది. సాహో తర్వాత దాదాపు ఐదేళ్లు సుజీత్ ఎలాంటి సినిమా చేయలేదు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన ఓజీ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Read more Photos on
click me!

Recommended Stories