స్టార్ హీరోయిన్ గా కోట్లు ఆర్జిస్తున్న రష్మిక మందానకు ఉన్న ఓ చెడ్డ అలవాటు ఉంది. ఆమె కుక్క బిస్కెట్లు తింటుందట. ఈ విషయాన్ని నితిన్ నేరుగా చెప్పాడు. రష్మిక-నితిన్ జంటగా భీష్మ మూవీ చేశారు. ఈ చిత్రానికి వెంకీ కుడుములు దర్శకుడు. భీష్మ సూపర్ హిట్ కొట్టింది. భీష్మ ప్రమోషనల్ ఈవెంట్లో నితిన్ ని యాంకర్ ఓ ప్రశ్న అడిగింది. మాకు ఎవరికీ తెలియని రష్మికకు సంబంధించిన ఒక రహస్యం చెప్పాలని కోరింది..
మనం ఆకలైతే స్నాక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ తింటాము. కానీ రష్మిక కుక్క బిస్కెట్లు తింటుంది. ఆమెతో నాకు ముద్దు సీన్ లేనందుకు హ్యాపీ అన్నారు. రష్మిక చెప్పకు అని వారిస్తున్నా.. నితిన్ చెప్పేశాడు. రష్మిక మనసులో ఏమనుకుందో కానీ పాపం నవ్వుకుని వదిలేసింది. రష్మిక కుక్క బిస్కెట్లు తినడం హాట్ టాపిక్ అయ్యింది.