బాలీవుడ్ సెక్సీ క్వీన్ బిపాషా బసు.. ఒకప్పుడు బాలీవుడ్ ను తన అందాలతో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు భర్తతో కామ్ గా కాపురం చేసుకుంటుంది. ప్రస్తుతం బిపాషా ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ లో రూమర్స్ గట్టిగా నడుస్తున్నాయి.
మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. బాలీవుడ్ అందాల రాణిగా మారింది బిపాషా. ఫస్ట్ మూవీ అజ్‌నబీతోనే స్టార్‌డమ్ తెచ్చుకుంది బసు. ఆ తర్వాత సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ తన స్టార్‌డమ్‌ను పెంచుకుంటూ పోయింది బిపాషా బసు.
26
రీసెంట్ ఇయర్స్ లో తనతో కలిసి నటించిన కరణ్ సింగ్ గ్రోవర్ ను ప్రేమించి పెళ్ళాడిన బిపాషా కరణ్ తో కలిసి హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ వస్తోంది. కరణ్ తో రొమాన్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ.
36
ఒక రీసెంట్ గా బిపాషా, భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో పాటు ఫ్యామిలీ అంతా రెస్టారెంట్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెను క్లిక్‌మనిపించిన ఫొటోగ్రాఫర్లు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇందులో బిపాషా వదులుగా ఉన్న బ్లూ కలర్ డ్రెస్ లో కనిపించింది.
46
ఇక ఇలాంటి ఫోటో కనిపిస్తే మన సోషల్ మీడియా జనాలు వదిలిపెట్టరు కదా.. నెటిజన్లు ఈ ఫోటోలపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. బిపాషా బసు గర్భవతా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే.. త్వరలోనే జూనియర్ బిపాషా రాబోతుందంటూ శుభాకాంక్షలు కూడా చెప్తున్నారు.
56
అయితే మరికొందరు మాత్రం లూజ్‌గా ఉన్న డ్రెస్ వేసుకుంటే ప్రెగ్నెంట్ అయిపోతారా? అని మిగతా నెటిజన్లపై కోపం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బిపాషా చాలా కాలం తరువాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
66
ఎలోన్ సినిమాలో బిపాషా బసు, కరణ్ సింగ్ ఇద్దరూ జంటగా నటించారు. హాట్ హాట్ సీన్స్ తో రెచ్చిపోయారు. దాంతో ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే వీరి మధ్య ప్రేమ మొగ్గలేసింది. దీంతో కొన్ని నెలల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2016లో పెళ్లి చేసుకుంది.