19 సంవత్సరాలకే ప్రెగ్నెంట్ అయ్యా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Published : Feb 17, 2023, 10:46 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ లైఫ్ టైమ్ చాలా తక్కువగా ఉంటుంది. కాస్త ఏజ్ పెరిగినా..షేప్ అవుట్ అయినా.. ఛాన్స్ లుమిస్ అయినట్టే.. వెనకబడ్డట్టే. అలా కెరీర్ చాలా తక్కువ టైమ్ లో ఆపేసిన హీరోయిన్లలో సోనమ్ కూడా ఒకరు. ప్రస్తుతం రీ ఎంట్రీకి రెడీ అవుతునన ఆమె సంచలన విషయాలు వెల్లడించారు. 

PREV
16
19 సంవత్సరాలకే ప్రెగ్నెంట్  అయ్యా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

32ఏళ్ళ తరువాత మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది సోనమ్ ఈవిషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. తన ఫిల్మ్ కెరీర్ కు సంబంధించిన సంచలన విషయాలు వెల్లడించింది సోనమ్. 19 సంవత్సరాలకే తాను ప్రెగ్నెంట్ అయ్యానని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ సీనియర్ బ్యూటీ. ఈ సీనియర్ హీరోయిన్ మెగాస్టార్ తో కూడా నటించి మెప్పించింది. వివరాల్లకి వెళ్తే..

26

దాదాపు 30 ఏళ్ళ క్రితం బాలీవుడ్ లో వరుస సినిమాలతో వెలుగు వెలిగింది హీరోయిన్ సోనమ్. అజూబా, విశ్వాత్మ లాంటి సినిమాలతో ఆమె స్టార్ గా వెలుగొందింది.సూపర్ హిట్ సినిమాలతో  బాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది సీనియర్ బ్యూటీ. సడెన్ గా ఇండస్ట్రీ నుంచి మాయమైపోయింది సోనమ్. మళ్ళీ మూడు దశాబ్ధాల తరువాత రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. 

36

ఓ ఇంటర్వ్యేలో మాట్లాడిన సోనమ్ తన జీవితంలో జరిగిన  సంఘటనల గురించి..  సినిమాలు వదిలేయడానికి కారణాలు, ఇంకొన్ని పర్సనల్ విషయాల గురించి పంచుకుంది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 1997లో ఇండియాను వదిలి వెళ్లిపోయాను .. 14 సంవత్సరాలకే పని చేయడం ప్రారంభించినట్లు ఈ సందర్భంగా సోనమ్ తెలిపింది. 

46

ఇక తన జీవితంలో కష్ట సుఖాలను అన్నీ చూశానని ఆమె అన్నారు. అందే కాదు 19వ ఏటనే గర్భం దాల్చాను అని షాకింగ్ విషయన్ని వెల్లడించింది.  కరోనా సమయంలో నేను ఓటీటీల్లో చాలా షోలు, వెబ్ సిరీస్ లు చూశాను. అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను నేనెందుకు ఇలాంటి సిరీస్ లు, షోలు చేయకూడదు అని సోనమ్ చెప్పుకొచ్చారు.

56

ఇక ఆలస్యం చేయకుండా.. ఫిట్ నెస్ పై  దృష్టి పెట్టి, 30 కిలోలు తగ్గానంటున్నారు సోనమ్.  ఇక దాదాపు 32 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు సోనమ్.  లైఫ్ అన్నాక అన్నింటిని దాటుకుని ముందుకు పోవడమే అని సోనమ్ అన్నారు.
 

66

ఇక ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో సోనమ్ నటించనుంది. మంచి కథ దొరికితే సినిమా చేయడానికి కూడా రెడీ అంటోంది. అంతే కాదు ఏజ్ తో సంబంధం లేకుండా  కథకు తగ్గట్లుగా తన శరీరాన్ని మార్చుకోవడానికి సిద్దం అని ఆమె పేర్కొన్నారు.50 ఏళ్లు వచ్చినా.. తనలో జోరు కాని ఎనర్జీ కాని పోలేదంటోంది సోనమ్. సోనమ్ తెలుగులో కూడా సినిమాలు చేసింది.  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన కొదమ సింహం సినిమాలో నటించి మెప్పించింది.

Read more Photos on
click me!

Recommended Stories