'దసరా' రీసౌండ్ ఇండియా మొత్తం వినపడాలి.. హరీష్ రావు, అంబటి రాయుడుతో వేదిక పంచుకున్న నాని

Published : Feb 17, 2023, 07:09 AM IST

నేడు సీఎం కేసీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నిన్న గురువారం  సిద్దిపేటలో 'సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్ 3' లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు, నేచురల్ స్టార్ నాని, క్రికెటర్ అంబటి రాయుడు అతిథులుగా హాజరయ్యారు.

PREV
19
'దసరా' రీసౌండ్ ఇండియా మొత్తం వినపడాలి.. హరీష్ రావు, అంబటి రాయుడుతో వేదిక పంచుకున్న నాని

నాని నటిస్తున్న తదుపరి చిత్రం 'దసరా'. డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

 

29

నాని ఈ చిత్రాన్ని తెలంగాణాలో వీలైనంత ఎక్కువగా ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. నేడు సీఎం కేసీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నిన్న గురువారం  సిద్దిపేటలో 'సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్ 3' లాంచ్ అయింది. 

39

ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు, నేచురల్ స్టార్ నాని, క్రికెటర్ అంబటి రాయుడు అతిథులుగా హాజరయ్యారు. దీనితో ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రీరిలీజ్ ఈవెంట్ ని తలపించేలా గ్రాండ్ గా ఈ కార్యక్రమం జరిగింది. 

 

49

నాని, హరీష్ రావు, అంబటి రాయుడు ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. నాని మాట్లాడుతూ.. ఇంత పెద్ద క్రికెట్ ఈవెంట్ ని తానెప్పుడూ చూడలేదు అని అన్నారు. తెలుగు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

59

తెలుగు సినిమాఫై నాకు ఒకే ఒక కంప్లైంట్ ఉంది. మనం మన కల్చర్ ని సెలెబ్రేట్ చేసుకోము. ఇతర భాషల్లో అది కనిపిస్తుంది. మన కల్చర్, రూట్ లెవల్స్ లో ఉన్న చిత్రాలకి ఎక్కువగా ఆదరణ ఉండదు. కానీ అలాంటి చిత్రంలో నటించేలానే నానా కోరిక దసరాతో తీరింది. 

69

దసరా చిత్ర రీసౌండ్ ఇండియా మొత్తం వినిపించాలి అని నాని అభిమానులని కోరారు. ఇక ఈ కార్యకమ్రంలో హరీష్ రావు, అంబటి రాయుడు కూడా మాట్లాడారు. 

79

సుధాకర్ చెరుకూరి దసరా చిత్రానికి నిర్మాత. నేను లోకల్ తర్వాత కీర్తి సురేష్ మరోసారి నానితో రొమాన్స్ చేస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో కమర్షియల్ గా బలమైన విజయం సొంతం చేసుకోవాలని నాని ప్రయత్నిస్తున్నాడు. 

89

దసరా చిత్రం తెలుగు తమిళ, మలయాళీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. ఇటీవల నాని నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయాయి. 

99

ఈ చిత్రంలో నాని గెటప్, యాటిట్యూడ్ పూర్తి భిన్నంగా ఉంది. తొలిసారి నాని ఈ తరహా రస్టిక్ రోల్ చేస్తున్నాడు. మార్చి 30న ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories