బాలీవుడ్ లో మరో తాజా ప్రేమ జంట, నైట్ అంతా కలిసి ఒకే గదిలో కార్తీక్ ఆర్యన్‌ - పష్మీన రోషన్...?

Published : Nov 08, 2022, 07:40 PM IST

బాలీవుడ్ లో మరో కొత్త ప్రేమ సందడి చేస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే న్యూస్  చెక్కర్లు కొడుతుంది. స్టార్ వారసురాలితో.. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు.   

PREV
16
బాలీవుడ్ లో మరో తాజా ప్రేమ జంట, నైట్ అంతా కలిసి ఒకే గదిలో  కార్తీక్ ఆర్యన్‌ - పష్మీన రోషన్...?

బాలీవుడ్ లో కొత్త ప్రేమ జంట సందడి చేస్తుంది. యువ హీరో కార్తీక్ ఆర్యన్ .. స్టార్ వారసురాలు రాకేష్ రోషన్ ఫ్యామిలీకి చెందిన యంగ్ స్టార్ పష్మీనా రోషన్ కలసి తిరుగుతున్నారు. వారిద్దరి మధ్య ఉన్నది మొదట స్నేహం అని అనుకున్నారు అంతా. కాని  వాళ్లిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ కాదు మరేదో అంటూ ముంబై మీడియా తెగ హడావిడి చేస్తుంది. 

26

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ‌పష్మినా రోషన్. హృతిక్ రోషన్ కజిన్ రాజేష్ రోషన్ కూతురు అయిన పష్మినా రోషన్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. తెరంగేట్రం చేయక ముందే అమ్మడు కార్తీక్ ఆర్యన్ కి క్లోజ్ అయ్యింది. బాలీవుడ్ లో ఏ సంబరాలు జరిగినా.. ఆమె కార్తీక్ వెంటే ఉంటుంది. ఎక్కడ చూసినా వీళ్లు కలిసే ఉంటున్నారు. అందులోనే వీళ్ళు ఉండే విధానం చూస్తే.. ఫ్రెండ్ షిప్ లాగా అనిపించకపోవడంతో.. జనాలు ఫిక్స్ అయ్యారు. 
 

36

అంతేకాదు ఈ మధ్య జరిగిన దీపావళి సెలబ్రెషన్స్ లో కూడా ఇద్దరు కలిసి ఉన్నారట. మరో విశేషం ఏంట అంటే.. ఆరోజు నైట్ అంతా ఇద్దరు కలిసే ఉన్నారని సమాచారం. మరి విషయం ఇంత వరకూ వచ్చిందా అంటూ.. జనాలు గుసగుసలాడుతున్నారు. అయితే ఈ విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఉన్నది ఫ్రెడ్ షిప్పే అంటూ కొందరు గట్టిగా వాధిస్తున్నారు. మరికొంత మంది మాత్రం వీళ్ళ వ్యావహారం  ఫ్రెండ్ షిప్ రేంజ్ దాటిపోయిందంటున్నారు. 

46

కార్తీక్ ఇంతకు ముందు కూడా చాలా మంది హీరోయిన్లతో  సంథింగ్ సంథింగ్ అని రూమర్స్ వినిపించాయి . కార్తీక్ ఆర్యన్  ఇదివరకు సారా అలి ఖాన్ అనన్యా పాండేలతో కూడా రిలేషన్ లో ఉన్నాడంటూ న్యూస్ వినిపించింది. అయితే అవి కేవలం గాలివార్తలుగానే మిగిలిపోయాయి.  ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ అవి కేవలం గాలి వార్తలని తేలింది. అంతే కాదు ఆ బ్యూటీస్ ఇద్దరు కూడా కార్తీక్ పై తమ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చారు.

56

అయితే  కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం  పష్మినాతో ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు సూపర్ ఫాస్ట్ గా స్ప్రడ్ అవుతున్నాయి. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే పష్మినా రోషన్ వార్తల్లో నిలుస్తుంండటంతో.. ఇదంతా ఆమెకు పబ్లిసిటీ ఇచ్చే క్రమంలో ప్లాన్ ప్రకారం జరుగుతుందంటూ మరో న్యూస్ వినిపిస్తుంది. 

66

ఇక త్వరలో ఈ స్టార్ వారసురాలి  సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంత వరకూ కు కార్తీక్ పష్మినా ల మధ్య లవ్ స్టోరీ అంటూ వస్తున్న వార్తలపై వాళ్లిద్దరు స్పందించలేదు. ఈ విషయంలో వాళ్లు ఎలా  రెస్పాండ్ అవుతారో చూడాలి. కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం ఫ్రెడ్డీ సినిమాతో వస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన టీజర్ బీ టౌన్ ఆడియన్స్ ని మెప్పించింది. 
 

Read more Photos on
click me!

Recommended Stories