ఈ 9 సినిమాలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ చేయాల్సింది.. కానీ!

First Published Jun 17, 2020, 9:46 AM IST

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి నుంచి పరిశ్రమ ఇంకా కోలుకోలేకపోతోంది. ఈ యంగ్ హీరో మరణంతో ఇండస్ట్రీలోని చీకటి కోణాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ మిస్‌ అయిన భారీ చిత్రాల లిస్ట్ తెర మీదకు వచ్చింది.

రొమాంటిక్‌ మ్యూజికల్ బ్లాక్‌ బస్టర్ మూవీ ఆషీఖీ 2 సినిమా కోసం ముందుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఆడిషన్ చేశారు. అంతా ఓకె అనుకున్న సమయంలో చివరి నిమిషంలో ఆదిత్య రాయ్‌ కపూర్‌ను హీరోగా ఫైనల్‌ చేశారు.
undefined
సంజయ్‌ లీలా బన్సాలీ తెరకెక్కించిన భారీ రొమాంటిక్ లవ్‌ స్టోరి రామ్‌ లీలా. ఈ సినిమాలో హీరోగా సుశాంత్ ను తీసుకోవాలని భావించాడు దర్శకుడు. కానీ నిర్మాణ సంస్థ నిబంధనలకు ఓకె చెప్పేందుకు ఇష్టపడని సుశాంత్, ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు.
undefined
బాజీరావ్‌ మస్తానీ సినిమాకు కూడా సుశాంత్ నే తీసుకోవాలనుకున్నాడు సంజయ్‌, కానీ ఆ సమయంలో సుశాంత్ పానీ సినిమాతో బిజీగా ఉండటంతో ఈ భారీ చారిత్రాక చిత్రంలో నటించే అవకాశాన్ని కోల్పోయాడు. ఆ ఛాన్స్ రణవీర్‌ చేతికి వెళ్లింది.
undefined
సుశాంత్ తొలి సినిమాకు కారకుడైన అభిషేక్ కపూర్‌ మరో సినిమాను ఈ హీరోతో చేయాలనుకున్నాడు. ఫితుర్ సినిమాను సుశాంత్‌కు ఆఫర్‌ చేశాడు. కానీ ఆ సమయంలో సుశాంత్ డేట్స్ ఖాళీ లేకపోవటంతో ఈ సినిమాను మిస్ చేసుకున్నాడు.
undefined
ఆదిత్య చోప్రా దర్శకత్వంలో రూపొందిన బేఫికర్ సినిమా కోసం కూడా ముందుగా సుశాంత్ నే సంప్రదించారు. కానీ ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్‌ రణవీర్‌ చేతికే వెళ్లింది.
undefined
చేతన్‌ భగత్‌ నవల ఆధారంగా అర్జున్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన సినిమా హాఫ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌. ఈ సినిమాకు ముందుగా సుశాంత్‌ ను తీసుకోవాలని భావించిన డేట్స్ అడ్జస్ట్ కాక ఓకే చెప్పలేదు.
undefined
రా (రోమియో అక్బర్ వాల్టర్‌) సినిమాకు కూడా ముందుగా సుశాంత్‌నే తీసుకున్నారు. సుశాంత్ ఈ సినిమాకు డేట్స్‌ కూడా ఇచ్చాడు. కానీ సినిమా సెట్స్ మీదకు వెళ్లిన తరువాత డేట్స్ క్లాష్‌ రావటంతో సుశాంత్ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆ ప్రాజెక్ట్ జాన్‌ అబ్రహం చేతికి వెళ్లింది.
undefined
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సడక్‌ 2 సినిమాకు కూడా సుశాంత్‌ను ఆడిషన్ చేశారు. కానీ ఫైనల్‌గా ఆ క్యారెక్టర్‌ ఆదిత్య రాయ్ కపూర్‌కు వెళ్లింది.
undefined
రాకేష్‌ శర్మ బయోపిక్‌ గా తెరకెక్కుతున్న సారే జహాసే అచ్చా సినిమాకు కూడా సుశాంత్‌నే సంప్రదించారు. కానీ ఫైనల్‌గా విక్కీ కౌశల్‌ను ఫైనల్‌ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆ ప్లేస్‌లో సల్మాన్‌ ఖాన్‌ను తీసుకున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.
undefined
click me!