జైలర్ 2 లో బాలకృష్ణ కు బదులుగా బాలీవుడ్ స్టార్ హీరో, సూపర్‌ స్టార్‌ సినిమాలో బాద్‌షా

Published : Dec 02, 2025, 03:01 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న సినిమా  జైలర్ 2. ఈ  సినిమాలో బాలకృష్ణ చేయాల్సిన  గెస్ట్ రోల్.. ఆయన చేయను అనడంతో.. బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకున్నట్టు తెలుస్తోంది. 

PREV
14
రజినీకాంత్ సినిమాలో షారుఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తరువాత మరోసారి కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. 'హే రామ్' తర్వాత.. తాజాగా రజినీకాంత్ 'జైలర్ 2'లో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ పాత్ర కోసం గతంలో బాలకృష్ణను సంప్రదించారట మేకర్స్. కానీ ఆయన ఒప్పుకోలేదన్న పుకార్లు వినిపిస్తున్నాయి.

24
భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న సినిమా

జైలర్ 2 స్థాయిని పెంచడానికి మూవీ టీమ్ స్టార్ హీరోలతో గెస్ట్ రోల్స్ చేయిస్తున్నారు. ఈక్రమంలో బాలయ్య బాబును కూడా అడిగినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఇందులో ఒక హిందీ సూపర్ స్టార్‌ను కూడా తీసుకోవాలి అనే ఆలోచనతో షారుఖ్ ను సంప్రదించినట్లు తాజా సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇండస్ట్రీలో మాత్రం షారుఖ్ ఖాన్ రజినీకాంత్‌తో స్క్రీన్ పంచుకునే అవకాశం ఉన్నట్టు టాక్ నడుస్తోంది.

34
కూలీ సినిమా మిస్ అయిన బాద్ షా

షారుఖ్ ఖాన్ చేయాల్సిన భాగం షూటింగ్ మార్చి 2026లో ప్లాన్ చేసినట్లు సమాచారం. మొదట 'కూలీ'లో అతిథి పాత్ర కోసం ఆయన్ని సంప్రదించినా, ఆయన తిరస్కరించడంతో ఇప్పుడు 'జైలర్ 2' కోసం ఖరారయ్యారని తెలుస్తోంది.

44
కింగ్ సినిమా షూటింగ్‌లో బిజీగా

'జైలర్ 2' మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుంది. ఇందులో రజినీకాంత్ పాండియన్ పాత్రలో విగ్రహాల స్మగ్లింగ్ ముఠాతో పోరాడతాడు. కాగా ప్రస్తుతం షారుఖ్ సుహానా ఖాన్‌తో కలిసి 'కింగ్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories