నర్గీస్ నుంచి రిషి కపూర్ వరకు.. బాలీవుడ్ దిగ్గజాలను కబళిస్తున్న క్యాన్సర్

First Published Apr 30, 2020, 4:16 PM IST

రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు దిగ్గజ నటులను కోల్పోవడంతో బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బుధవారం విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించగా, గురువారం అలనాటి సూపర్‌స్టార్ రిషి కపూర్ కన్నుమూశారు. వీరిద్దరూ కూడా క్యాన్సర్‌ మహమ్మారికే బలయ్యారు.

నర్గీస్ దత్: బాలీవుడ్ లెజండరీ నటి నర్గీస్ దత్ 1981లో క్యాన్సర్‌తో కన్నుమూశారు. సరిగ్గా కుమారుడు సంజయ్ దత్ హీరోగా అరంగేట్రం చేసిన తొలి సినిమా రాకీ మూడు రోజుల్లో విడుదలవుతుందనగా ఆమె మరణించడం దిగ్భ్రాంతికరం.
undefined
ఫిరోజ్‌ఖాన్: జుల్ఫీకర్ అలీషా ఖాన్‌గా జన్మించి హిందీ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫిరోజో ఖాన్ ఏప్రిల్ 27, 2009న ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 69 సంవత్సరాలు. ఫిరోజ్‌ఖాన్‌ అంత్యక్రియలను బెంగళూరులోని తన తల్లి సమాధి వద్ద నిర్వహించారు.
undefined
వినోద్ ఖన్నా: హ్యాండ్సమ్ హీరోగా 80లలో దేశాన్ని ఒక ఊపు ఊపిన వినోద్ ఖన్నా ఏప్రిల్ 27, 2017న ప్రాణాలు కోల్పోయారు. మూత్రాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వినోద్ కన్నుమూశారు.
undefined
ఇర్ఫాన్ ఖాన్: విలక్షణ నటుడిగా ఖ్యాతి గడించిన ఇర్ఫాన్ ఖాన్ బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాను అత్యంత అరుదైన రకం క్యాన్సర్‌తో బాధపడుతున్నానని బతుకుతానో, లేదోనంటూ ట్వీట్ చేసిన ఆయన బాలీవుడ్‌ను షాక్‌కు గురిచేశారు. అయితే లండన్‌లో విజయవంతంగా చికిత్స పూర్తిచేసుకున కెమెరా ముందుకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ పెద్దప్రేగుకు ఇన్ఫెక్షన్ సోకడంతో మంగళవారం రాత్రి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఇర్ఫాన్ ఖాన్ తుదిశ్వాస విడిచారు.
undefined
రిషి కపూర్: బాలీవుడ్ సూపర్‌స్టార్ రిషి కపూర్‌ లుకేమియాతో బాధపడుతున్నట్లు 2018లో బయటి ప్రపంచానికి తెలిసింది. న్యూయార్క్‌లో కొద్దిరోజుల పాటు ట్రీట్‌మెంట్ తీసుకుని తిరిగి భారతదేశానికి వచ్చిన ఆయనకు ఇక గండం గడిచిందని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో గురువారం ఉదయం 8.45 గంటలకు రిషి కపూర్ తుదిశ్వాస విడిచారు.
undefined
click me!