
బాలీవుడ్ హీరోయిన్లు ఎంచక్కా అటు కెరీర్ ని, ఇటు మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమందైతే పెళ్లెప్పుడు చేస్కుందామా అని వెయిట్ చేస్తున్నారు. కాజల్ లాంటి హీరోయిన్లైతే చేతిలో సినమాలు వదులుకుని మరీ పెళ్లి చేసుకుని పెద్దగా లేట్ కూడా చెయ్యకుండా ఫ్యామిలీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ మన హీరోయిన్లు మాత్రం అబ్బే..అప్పుడే పెళ్లేంటని కొట్టిపారేస్తున్నారు.
బాలీవుడ్ లో వరసగా హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటుంటే సౌత్ హీరోయిన్లు పెళ్లి ఊసే ఎత్తడం లేదు .బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ..కెరీర్ లోపీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకన్నా కానీ ..కెరీర్ ని ఏమాత్రం పక్కకి పెట్ట లేదు వరసగా అదే స్పీడ్ లో సినిమాలు చేస్తోంది. ఇటు కత్రీనా కైఫ్ కూడా కరెక్ట్ టైమ్ లో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసేసుకుంది. రీసెంట్ గా ఫ్యామిలీ లైఫ్ ను స్టార్ట్ చేసిన కత్రీనా.. కెరీర్ ను మాత్రం ఆపేయను అని చెప్పేసింది.
ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదుగుతున్నప్పుడే ప్రియాంకా చోప్రా కూడా పెళ్లి చేసుకుంది కానీ .. ఇంకా యాక్టర్ గా కంటిన్యూ అవుతూనే ఉంది. అనుష్క శెట్టి, సోనమ్ కపూర్, విద్యాబాలన్..ఇలా హీరోయిన్లందరూ హీరోయిన్లుగా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాళ్లయ్యి కూడా కెరీర్ కంటిన్య చేస్తున్నారు. కానీ మన వాళ్లు మాత్రం పెళ్లి వైపు కూడా చూడడం లేదు .
చేసింది తక్కువ సినిమాలైనా ..ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీస్ చేసిన యామీ గౌతమ్ , మౌని రాయ్ లాంటి హీరోయిన్లు కూడా పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. లేటెస్ట్ గా టాప్ హీరోయిన్ గా వరసగా సినిమాలతో బిజీగా ఉన్న ఆలియా భట్ కూడా రణబీర్ తో పెళ్లి పీటలెక్కడానికి టైమ్ కోసం వెయిట్ చేస్తోంది. అంతేకాదు .. రణబీర్ కి నాకు మనసులోఎప్పుడో పెళ్లి అయిపోయిందంటూ క్రేజీ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది.
అసలు పెళ్లి ఊసేఎత్తని 40 ఏళ్ల స్టార్ హీరోయిన్ అనుష్క. సౌత్ లో అనుష్క అన్ డౌటెడ్ లీస్టార్ హీరోయిన్ . అరుంధతి, సైజ్ జీరో, బాహుబలి, భాగమతి లాంటి సినిమాలతో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్, ఇమేజ్ సంపాదించుకుంది స్వీటీ. కెరీర్ కిమధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్లీ సినిమాలు మొదలుపెట్టిన అనుష్క..పెళ్లి అంటే మాత్రం మాటదాటేస్తోంది. ఎప్పుడు రాసి పెట్టిఉంటే అప్పుడే జరుగుతుంది..వాటి గురించి ఆలోచించడంఎందుకంటోంది.
సౌత్ మొత్తం చుట్టేస్తున్న త్రిష కూడా అంతే. ఈ సంవత్సరం.. నెక్ట్స్ ఇయర్ పెళ్లి చేసుకుంటానని చెబుతూనే వస్తోంది. ఇక ఎన్నాళ్లని ఈ సోలో లైఫ్.. నేను కూడా మ్యారీడ్ లైఫ్ టేస్ట్ చూస్తానని చాలా కాలం నుంచి చెబుతోంది. ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిన్న త్రిష.. ఈ సారి ఆ తప్పు చెయ్యనంటోంది. నన్ను నన్ను ఇష్టపడే వాడు దొరకినప్పుడు అస్సలు ఏమాత్రం ఆలోచించకుండా చేసేసుకుంటానన్న38ఏళ్ల త్రిష ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు .
32 ఏళ్ల మిల్కీ బ్యూటీ తమన్నా ... కూడా సారీ బాస్ ఇప్పుడు నేనుపెళ్లిచేస్కునే మూడ్ లో లేను. వరసగా సినిమాలు , సిరీస్ లు , షోలు ..ఇలా బ్యాక్ టూ బ్యాక్ వర్క్ తో బిజీగా ఉన్నప్పుడు పెళ్ళి గురించి ఎలా ఆలోచిస్తానంటోంది. ప్రజెంట్ ,ఎఫ్3, గుర్తుందా శీతాకాలం, చిరంజీవి , నాగార్జున ఇలా చాలా సినిమాలు చేస్తోంది తమన్నా.
సౌత్ లో స్టార హీరోయిన్ గా చక్రం తిప్పుతూ.. నార్త్ లో కూడా ఇప్పుడిప్పుడే బాగా బిజీ అవుతున్న పూజాహెగ్డే అయితే .. నాకా...పెళ్లా.. అసలు దాని గురించి ఆలోచనే లేదంటోంది. చేతిలో 4,5 ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగాఉన్న పూజా.. ప్రజెంట్ చేస్తున్న సినిమాలన్నీ స్టార్ హీరోలతోనే. అందుకు అసలుపెళ్లి ఊసే నా దగ్గర తీస్కురావద్దంటోంది. పెళ్లికి ఇంకా చాలా టైముంది.. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కాదు కదా..ఆలోచేం టైమ్ కూడా లేదంటోంది ఈ 31 ఏళ్ల ముద్దుగుమ్మ.
సౌత్ లో అన్ని ఇండస్ట్రీస్ కి మోస్ట్ వాంటెడ్ క్యూట్ హీరోయిన్ గా మారిపోయింది మళయాళ భామ సాయిపల్లవి. కెరీర్ బానే ఉంది..మరి పెళ్లి సంగతేంటి..? ప్రేమ పెళ్లా..? పెద్దలు కుదిర్చిన పెళ్లా అని అభిమానులు అడిగితే .. అబ్బే ..అసలు ఆ ఉద్దేశ్యమే లేదంటోంది. ఫిదా సినిమాలో తన తండ్రిని వదిలి వెళ్లను..అసలు పెళ్లి చేసుకోను అన్న సాయిపల్లవి రియల్ లైఫ్ లో కూడా ఇలానే అంటోంది ఈ యాక్టర్ కమ్ డాక్టరమ్మ.
నేషనల్ క్రష్ రష్మిక అయితే ... నేనింకా చిన్నపిల్లని ..నాతో పెళ్లి లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదంటోంది. పాతికేళ్ల ఈముద్దుగుమ్మ..ఇప్పుడు సౌత్ లోనే బిజీ యెస్ట్ హీరోయిన్ . సౌత్ స్టార్ హీరోలతో పాటు ..బాలీవుడ్ హీరోల్ని కూడా లైన్లో పెట్టేసిన రష్మిక మందాన ..పెళ్లి అనే మాట అనడానికి కూడా టైమ్ లేదంటోంది. పుష్ప హిట్ తో మరిన్ని సినిమా ఛాన్సులతో బిజీ అయిన రష్మక పెళ్లికేం తొందరంటోంది. ఒక వైపు నార్త్ హీరోయిన్లు కెరీర్ పీక్స్ లోనే వాళ్లు పెళ్లి చేసుకుని కెరీర్ కంటిన్యూ చేస్తుంటే ..సౌత్ హీరోయిన్లు మాత్రం..పెళ్లి మాట ఎత్తితే తప్పించుకుతిరుగుతున్నారు.