బ్యాక్ లెస్ అవుట్ ఫిట్ లో ’వార్‘ బ్యూటీ అందాల విందు.. బిగుతైన డ్రెస్ లో వాణి కపూర్ కిల్లింగ్ స్టిల్స్..

First Published | May 19, 2023, 4:22 PM IST

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ వాణి కపూర్ (Vaani Kapoor) నయా లుక్స్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ కు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన ఫ్యాషన్ సెన్స్, గ్లామర్ మెరుపులతో కట్టిపడేసింది. పిక్స్ వైరల్ గా మారాయి. 
 

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ వాణి కపూర్ ’శుద్ధ్ దేసి రొమాన్స్‘ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ చిత్రంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత మరిన్ని ఆఫర్లను అందుకుంటూ వస్తోంది. 
 

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan)  సరసన వాణి కపూర్ ’వార్‘లో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది. దీంతో వాణి కపూర్ కు ఇక్కడ కాస్తా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ’వార్2‘ కూడా రాబోతున్న విషయం తెలిసిందే. 
 


అయితే, వాణి కపూర్ WAR2లోనూ ఉంటుందా? మరో హీరోయిన్ వస్తుందా? అన్నది చూడాలి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించబోతుండటంతో ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి పెరిగింది. 

ఇదిలా ఉంటే వాణి కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. ఆయా ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లకూ హాజరవుతూ సందడి చేస్తుంటుంది. ఈ క్రమంలో వాణి కపూర్ ముంబైలో నిర్వహించిన Femina India 2023 Awards ఈవెంట్ కు హాజరైంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది.
 

ఈవెంట్ కోసం నటి వాణి కపూర్ మెరిసే బంగారు-నలుపు దుస్తులను ధరించింది. ఫంక్షన్‌లో వాణి స్క్రీన్ స్టీలర్ అవార్డును కూడా గెలుచుకుంది. ఫెమినా ప్రెజెంట్స్ మామార్త్ బ్యూటిఫుల్ ఇండియన్స్ 2023 అవార్డ్స్ షోలో స్పాట్‌లైట్‌ అవార్డును అందుకుంది. అదేవిధంగా ఈవెంట్ లో తనలుక్ తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.
 

గ్లామర్ మెరుపులు మెరిపించడం వాణి కపూర్ కు కొత్తేమీ కాదు. తాజాగా బ్యాక్ లెస్ టైట్ అవుట్ ఫిట్ లో అందాలను ప్రదర్శించింది. మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొట్టింది. ఆ ఫొటోలను చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఇక వాణి కపూర్ చివరిగా రన్బీర్ కపూర్ సరసన ’షంషెరా‘లో నటించింది. ప్రస్తుతం ప్రాజెక్ట్స్ పై అప్డేట్ లేదు.
 

Latest Videos

click me!