త్వరలో పెళ్లి చేసుకుంటా... మరో సంచలన ప్రకటన చేసిన నరేష్!

Published : May 19, 2023, 03:46 PM IST

నరేష్ తీరు చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ఆయన చర్యలు ఊహాతీతంగా ఉంటున్నాయి. లేటు వయసులో సహజీవనం చేస్తున్న ఆయన... తన జీవితంలోని వివాదాలను సినిమా రూపంలోకి తెస్తున్నారు.   

PREV
16
త్వరలో పెళ్లి చేసుకుంటా... మరో సంచలన ప్రకటన చేసిన నరేష్!


మళ్ళీ పెళ్లి చిత్రంలో నరేష్-పవిత్ర లోకేష్ జంటగా నటించారు. ఈ మూవీ నరేష్ జీవితంలో చోటు చేసుకున్న యదార్థ సంఘటనల సమాహారమే. టీజర్, ట్రైలర్ లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నరేష్ మాత్రం ఇది నా బయోపిక్ కాదంటున్నారు. మే 26న మళ్ళీ పెళ్లి విడుదల కానుంది. 
 

26

తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగుళూరులో కూడా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకున్నారా? అనే ప్రశ్న నరేష్ కి ఎదురైంది. దానికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. 

36
Image: Naresh / Twitter

మా మనసులు కలిశాయి. అందుకే కలిసి జీవిస్తున్నాము. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పవిత్రను నేను పెళ్లి చేసుకోలేదు. కానీ త్వరలో వివాహం చేసుకుంటాను, అన్నారు. చాలా మందికి ఇష్టం లేకపోయినా పెళ్లి బంధంలో ఉంటున్నారు. వాళ్ళ కోసమే మళ్ళీ పెళ్లి చిత్రమని నరేష్ అన్నారు. 
 

46
Actor Naresh

నరేష్ కి మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు కాలేదు. కాబట్టి మరో వివాహం చేసుకోవడానికి వీలులేదు. అయితే ఇటీవల సుప్రీం కోర్ట్ వెలువరించిన తీర్పు తనకు అనుకూలమని నరేష్ చెప్పడం విశేషం. అంటే తనకు ఇష్టం వచ్చిన వాళ్ళను వివాహం చేసుకోవచ్చని నరేష్ పరోక్షంగా చెప్పారు.

56
Ramya Raghupathi


రమ్య రఘుపతి విడాకులు కోరుకోవడం లేదు. తన కొడుకు కోసం భర్త కావాలని కోర్టులో పిటిషన్ వేశారు. గత ఐదేళ్లుగా నరేష్-పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారు. రమ్య రఘుపతి దూరమై ఓ ఏడెనిమిదేళ్లు అవుతుంది. వీరి మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకోగా విడిపోయారు. 
 

66
Malli Pelli Trailer

ఇక మళ్ళీ పెళ్లి చిత్ర విషయానికి వస్తే... ఎం ఎస్ రాజు దర్శకుడు. నరేష్ స్వయంగా నిర్మించారు. వనిత విజయ్ కుమార్ కీలక రోల్ చేశారు. శరత్ బాబు, జయసుధలను కృష్ణ, విజయనిర్మల పాత్రల్లో చూపించబోతున్నారు. సీనియర్ నటి అన్నపూర్ణ సైతం మళ్ళీ పెళ్లి చిత్రంలో నటిస్తున్నారు. 
 

click me!

Recommended Stories