క్రికెట్ మోజులో ఫోన్ పోగొట్టుకున్న ఊర్వశీ రౌతేలా, బంగారు తాపడం కూడా చేయించిందట.

Mahesh Jujjuri | Published : Oct 17, 2023 9:47 AM
Google News Follow Us

క్రికెట్ మ్యాచ్ అంటే చాలు చాలామందికి  ఒళ్లు తెలియదు. సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా..క్రికెట్ అంటే పిచ్చి ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఏదో మునిగిపోతున్నట్టు మ్యాచ్ పైనే దృష్టి పెట్టి.. విలువైన వస్తువులు పోగోట్టుకున్నవారు చాలా మంది ఉన్నారు.. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ కి అదే అనుభవం ఎదురయ్యింది. 

15
క్రికెట్ మోజులో ఫోన్ పోగొట్టుకున్న ఊర్వశీ రౌతేలా,  బంగారు తాపడం కూడా చేయించిందట.

ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మొన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఈ  మ్యాచ్ కోసం అభిమానులు ఎగబడ్డారు. సెలబ్రిటీలు కూడా ఆరాటపడ్డారు. ఇండియా.. పాక్ మ్యాచ్ అంటే ఇలాగే ఉంటుంది మరి. ఈ హడావిడిలో  ఒళు తెలియ కుండా విలువైన వస్తువులు కూడా పోగొట్టుకుంటున్నారు అందులో సెలబ్రిటీలకు కూడా ఉన్నారు. బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా కు కూడా ఇలాంటి అనుభవం ఎదురయ్యింది. 

25
Urvashi Rautela loses gold iPhone during Ind vs Pak match

తన అందంతో  అభిమానులకు ఆనందం పంచినా.. నటి ఊర్వశి రౌతేలాకు ఈ క్రికెట్ మ్యాచ్ మాత్రం చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. మ్యాచ్ లో ఇండియా గెలవడంతో.. ఆట అంతా చూసి ఎంజాయ్ చేసిన ఊర్వశి.. అందులో మునిగిపోయి.. తను ఎంతో ఇష్టంగా కొనుకున్న ఫోన్ పోగోట్టుకుంది.  అత్యంత ఖరీదైన తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నట్టు.. విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. 
 

35
Urvashi Rautela-Gold I-Phone

అంతే కాదు ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. తాను ఎంతో ఇష్టంతో కొనుకున్న ఈ ఫోన్  అలాంటి ఇలాంటిది కాదని అది 24 క్యారెట్ల బంగారం తాపడం చేసిన ఫోన్ అని చెప్పుకొచ్చింది. అది ఎవరికైనా దొరికితే ఇవ్వాలని సోషల్ మీడియా వేధికగా  వేడుకున్నారు. ఈ పోస్టుకు పోలీసులు, స్టేడియం అధికారిక  అకౌట్స్ ను కూడా   ట్యాగ్ చేశారు. ఆమె పోస్టును చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

Related Articles

45

ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని కొందరంటే.. మరికొందరు మాత్రం ఆ ఫోన్ దొరికిన వ్యక్తి అదృష్టవంతుడని కామెంట్ చేస్తున్నారు. బంగారం లాంటి ఫోన్ దొరికితే ఎవరైనా తిరిగిస్తారా? అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.  

55

 తెలుగులో పలు సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసిన ఊర్వశి.. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ పార్టీలో తళుక్కుమంది. ఇటీవల స్కంద సినిమాలోనూ మెరిసింది. 
.

Read more Photos on
Recommended Photos