ఎన్టీఆర్ - హృతిక్ ‘వార్2’లో కియారా అద్వానీ? ఇంతకీ బాలీవుడ్ భామ ఎవరి వైపు ఉంటుంది.. డిటేయిల్స్

First Published | Jun 17, 2023, 12:47 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆడియెన్స్ మెచ్చిన యష్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివరల్స్ లో ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ దక్కించుకుంది. War2లో కియారా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. 
 

స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani)  వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ కు జంటగా నటించిన ‘సత్యప్రేమ్ కి కథ’ చిత్రం ప్రమోషన్స్ లో ఉంది. తర్వలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో కియారా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. 
 

బాలీవుడ్ గ్రీక్ గాడ్, యాక్షన్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) - యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) మల్టీస్టారర్ గా ‘వార్2’ రాబోతున్న విషయం తెలిసిందే. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా చిత్రం రూపుదిద్దుకోనుంది. గతంలో ‘వార్’ ఎంతటి రెస్పాన్స్ ను దక్కించుకుందో తెలిసిందే. ప్రస్తుతం సీక్వెల్ పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 


అయితే, తాజాగా బాలీవుడ్ వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం.. స్టార్ బ్యూటీ కియారా అద్వానీ War 2లో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో కియారా యాక్షన్ తోనూ అలరిస్తుందా లేక మరేదైనా గ్లామర్ రోల్ లో కనిపిస్తుందా చూడాలి. 
 

కాగా ఈ వార్2లో ఓవైపు హృతిక్ రోషన్, మరోవైపు ఎన్టీఆర్ నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. దీంతో కియారా ఎవరి సరసన అలరించబోతోందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనిపై అధికారిక ప్రకటన అందాల్సి ఉంది. మొత్తానికి భారీ యాక్షన్ ఫిల్మ్ లో కియారా ఛాన్స్ దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
 

ఈ భారీ మల్టీస్టారర్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీపావళికి పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ జరగనుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారు. 
 
 

ఇక కియారా అదర్వానీ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  సరసన ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Latest Videos

click me!