అరాకొరా బట్టల్లో స్కిన్ షో చేసే తేజస్వి మాదివాడ పంథా మార్చింది. చీరలో సోయగాలు పంచుతున్న తేజస్విని లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
26
tejaswi madivada
సోషల్ మీడియాలో తేజస్వి బోల్డ్నెస్ హాట్ టాపిక్ అవుతుంది. అయితే. ఆమెకు బ్రేక్ రావడం లేదు. నటిగా దాదాపు ఫేడ్ అవుట్ అయినట్లే. గత ఏడాది ఆగస్టులో తేజస్వి మాదివాడ నటించిన కమిట్మెంట్ మూవీ విడుదలైంది. ఈ మూవీ సైతం నిరాశపరిచింది.
36
Tejaswi Madivada
కమిట్మెంట్ మూవీ మీద ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. చిత్ర ప్రమోషన్స్ లో తేజస్వి చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ మాత్రం హైలెట్ అయ్యాయి. అడల్ట్ మూవీస్ లో నటిస్తే తప్పేంటి అన్న తేజస్వి మాదివాడ... ఆఫర్స్ వస్తున్నప్పుడు కూడా ఐస్ క్రీం లాంటి అడల్ట్ కంటెంట్ మూవీ చేశాను అన్నారు.
46
Tejaswi Madivada
కాగా తేజస్విని ప్రస్తుతం బీబీ జోడి అనే డాన్స్ రియాలిటీ షో చేస్తున్నారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో బీబీ జోడీ డాన్స్ షో ఇటీవల స్టార్ మాలో స్టార్ట్ చేశారు. ఈ షోలో అఖిల్ సార్థక్ కి జంటగా తేజస్వి జోడీ కట్టారు. ఇక తేజస్వి మాదివాడ.. మహేష్-వెంకటేష్ ల మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో తేజస్వి వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీలో గోదావరి జిల్లా అమ్మాయిగా తక్కువ నిడివి కలిగిన పాత్ర చేశారు. మహేష్ తో ఆమెకు కొన్ని డైలాగ్స్ ఉంటాయి కూడాను. అనంతరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీం అనే అడల్ట్ కంటెంట్ మూవీ చేశారు.
56
ఐస్ క్రీం ఏమంత ఆడలేదు. కనీసం సెకండ్ హీరోయిన్స్ పాత్రలు కూడా తేజస్వికి దక్కలేదు. కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, బాబు బాగా బిజీ లాంటి చిత్రాల్లో కొంచెం ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. 2017లో బాలకృష్ణుడు చిత్రం తర్వాత ఆమెకు చాలా గ్యాప్ వచ్చింది.
66
Tejaswi Madivada
బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న తేజస్వి మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఆమె కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు.హౌస్లో అందాల ప్రదర్శన పైనే దృష్టి పెట్టిన తేజస్వి మాదివాడ 7వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచాడు. ఇక హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తేజస్వికి అవకాశం దక్కింది. ఓటీటీలో కూడా తేజస్వి ప్రభావం చూపలేకపోయారు. ఆమె తక్కువ రోజుల్లోనే ఎలిమినేట్ కావడం జరిగింది. కెరీర్ పరంగా ఆమెకు ఏమీ కలిసిరాలేదు. ఆడపడదా ఆఫర్స్ కూడా రావడం లేదు. కనీసం ఓటీటీలో అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారు.