భూమిక నుండి ఇది ఊహించని యాంగిల్... హోమ్లీ బ్యూటీ ఇలా తయారయ్యిందేంటి!

Published : Apr 16, 2023, 03:12 PM ISTUpdated : Apr 16, 2023, 03:13 PM IST

ఒక దశలో భూమిక టాలీవుడ్ టాప్ హీరోయిన్. కుర్రాళ్ళ కలలు రాణి. ప్రస్తుతం హీరోయిన్ గా అవుట్ డేటెడ్ అయిన భూమిక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు.   

PREV
16
భూమిక నుండి ఇది ఊహించని యాంగిల్... హోమ్లీ బ్యూటీ ఇలా తయారయ్యిందేంటి!
bhumika chawla


గతంలో టాలీవుడ్ టాప్ స్టార్స్ కి భూమిక లక్కీ హీరోయిన్.  పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు భూమిక  బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చారు. భూమిక యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి.

26
bhumika chawla


ప్రస్తుతం భూమిక నాలుగు పదులు దాటిపోయింది. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి. కానీ భూమిక ఎప్పుడూ వెండి తెరకు దూరంగా లేదు. తన వయసుకు తగ్గ రోల్స్ చేస్తూనే ఉంది. అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తోంది. గత ఏడాది భూమిక సీటీ మార్  చిత్రంలో గోపీచంద్ కు అక్క పాత్రలో నటించింది. 

36
bhumika chawla


గతంలో భూమికకు తన భర్తతో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన ఫోటోస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో భూమిక తన భర్త భరత్ ఠాకూర్ తో కలసి ఉన్న రొమాంటిక్ స్టిల్స్ కూడా పోస్ట్ చేసింది. 
 

46
bhumika chawla

నిర్మాత భరత్ ఠాకూర్ ని భూమిక 2007లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత భూమిక హీరోయిన్ రోల్స్ తగ్గించి.. క్యారెక్టర్ రోల్స్ లో నటిస్తోంది. టాలీవుడ్ లో భూమికకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తన వైవాహిక జీవితం ఒడిదుడుకులతో సాగినట్లు భూమిక గతంలో పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది భూమిక, భరత్ విడిపోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ వార్తలని భూమిక ఖండించింది. 
 

56
bhumika chawla

తన మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు నిజమే అయినప్పటికీ తాము అన్నింటిని ఎదుర్కొంటూ అర్థం చేసుకుంటూ కలసి జీవిస్తున్నట్లు భూమిక ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది.

66
bhumika chawla

ఒక దశలో భూమిక టాలీవుడ్ టాప్ హీరోయిన్. కుర్రాళ్ళ కలలు రాణి. ప్రస్తుతం హీరోయిన్ గా అవుట్ డేటెడ్ అయిన భూమిక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. 

click me!

Recommended Stories