వాల్తేరు వీరయ్యతో తమిళ విలక్షణ నటుడి ఫ్యామిలీ.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' చిత్రం సంక్రాంతి కానుకగా నేడు గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 

bobby simha family with megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' చిత్రం సంక్రాంతి కానుకగా నేడు గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వింటేజ్ మెగాస్టార్ ని చూస్తారు అంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. 

bobby simha family with megastar Chiranjeevi

ఆల్రెడీ ప్రీమియర్స్ మొదలై టాక్ కూడా బయటకి వస్తోంది. వింటేజ్ మెగాస్టార్ మార్క్ కామెడీ టైమింగ్, మాస్ ఎలిమెంట్స్ తో వాల్తేరు వీరయ్య చిత్రం ఎంటర్టైనింగ్ గా ఉంది అంటూ ప్రేక్షకులు రెస్పాన్స్ ఇస్తున్నారు. చిత్రంలో కొన్ని డల్ మూమెంట్స్ ఉన్నప్పటికీ సంక్రాంతి సీజన్ లో ఈ చిత్రానికి ఎంజాయ్ చేయవచ్చు అని చెబుతున్నారు. 


ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. సప్తగిరి, షకలక శంకర్, వెన్నెల కిషోర్ కమెడియన్లుగా మెరిశారు. మాస్ మహారాజ్ రవితేజ ఈ చిత్రంలో 40 నిమిషాల గెస్ట్ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. చిరు, రవితేజ చాలా ఏళ్ల తర్వాత ఒకే ప్రేములో వెండి తెరపై కనిపించబోతుండడంతో ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రంలో తమిళ విలక్షణ నటుడు బాబీ సింహా కూడా కీలక  పాత్రలో నటించారు. 

నేడు ఈ చిత్ర రిలీజ్ సందర్భంగా.. షూటింగ్ లొకేషన్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని బాబీ సింహా సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన భార్య పిల్లలు, తల్లితో కలసి మెగాస్టార్ చిరంజీవితో దిగిన ఫోటోలని అభిమానులతో పంచుకున్నారు. 

'వాల్తేరు వీరయ్య చిత్రంలో నటించే అవకాశం లభించడం గర్వంగా ఉంది. చిరంజీవి సర్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో నా కల నెరవేరింది. నాకు ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ బాబీకి, మైత్రి సంస్థకి కృతజ్ఞతలు. పూనకాలు లోడెడ్ అని బాబీ సింహా పోస్ట్ చేశారు. 

బాబీ సింహా జిగర్తాండ, పేట లాంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. తెలుగులో డిస్కో రాజా, గల్లీ రౌడీ  లాంటి చిత్రాల్లో నటించారు. వాల్తేరు వీరయ్య బాబీ సింహాకి ఎలాంటి గుర్తింపు నిస్తుందో చూడాలి. 

Latest Videos

vuukle one pixel image
click me!