వకీల్ సాబ్ కి బ్లాక్ బస్టర్ టాక్... మొదటిరోజే 30-40 కోట్లట!

First Published Apr 8, 2021, 10:47 PM IST

సోషల్ మీడియాలో వకీల్ సాబ్ ప్రభంజనం మాములుగా లేదు. విడుదలకు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉండగా, ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధం అవుతున్నారు. వకీల్ సాబ్ విడుదల అవుతున్న థియేటర్స్ వద్ద కోలాహలం సృష్టించడానికి సిద్ధం అవుతున్నారు. 
 

ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోలు క్యాన్సిల్ కావడంతో పవన్ ఫ్యాన్స్ పూర్తి నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణాలో మాత్రం ఉదయం నాలుగు గంటలకే వకీల్ సాబ్ మూవీ వెండితెరపై పడనుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా రెండు వేలకు పైగా థియేటర్స్ లో వకీల్ సాబ్ విడుదల అవుతుంది.
undefined
బుకింగ్స్ రూపంలోనే భారీ వసూళ్లను రాబట్టింది వకీల్ సాబ్. వకీల్ సాబ్ చిత్రంపై ఉన్న హైప్ రీత్యా రూ. 30-40 కోట్ల రూపాయల మొదటిరోజు వసూళ్లు రాబట్టడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.
undefined
లాక్ డౌన్ తరువాత విడుదల అవుతున్న భారీ చిత్రం వకీల్ సాబ్ కావడం మరో విశేషం. బుక్ మై షో లో వకీల్ సాబ్ కి మూడు లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ దక్కాయి. దీన్ని బట్టి వకీల్ సాబ్ పై ఎంత మేర ఆసక్తి నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చు.
undefined
సోషల్ మీడియాలో వకీల్ సాబ్ మూవీపై బ్లాక్ బస్టర్ టాక్ నడుస్తుంది. లాయర్ గా పవన్ బాక్సాఫీస్ రికార్డ్స్ కొల్లగొట్టడంతో పాటు, నయా రికార్డ్స్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
undefined
ఫిల్మ్ క్రిటిక్స్, సెన్సార్ సభ్యులు ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రం చూడడంతో పాటు, పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ముఖ్యంగా పవన్ వన్ మాన్ షోతో అద్భుతం చేశాడంటూ చెప్పడం జరిగింది.
undefined
వకీల్ సాబ్ ప్రతి కోణంలో అలరించే చిత్రంగా, ముఖ్యంగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్ లా ఉంటుందని సెన్సార్ సభ్యులు చెప్పడంతో, పవన్ అభిమానులు మరింతగా సంబరాలు జరుపుకుంటున్నారు.
undefined
click me!