
హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక(Shivathmika Rajashekar)) ప్రస్తుతం తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగులో ఆమె ఇప్పటికే ఓ సినిమాతో ఆడియెన్స్ ని అలరించింది. ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది. మరోవైపు తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుంది. అయితే నేడు(శుక్రవారం) పుట్టిన రోజు జరుపుకుంటోంది శివాత్మిక. దీంతో అమ్మడి హంగామా మామూలుగా లేదు.
బర్త్ డే సందర్భంగా తన సోషల్ మీడియా అభిమానులకు మంచి విజువల్ ట్రీట్‌నిచ్చింది శివాత్మిక రాజశేఖర్. మరీ పొట్టిదైన షార్ట్ ధరించింది. మరోవైపు తాను ధరించిన షర్ట్ కూడా మరీ పొట్టిగవ్వడం విశేషం. దీంతో అటు నడుమందాలు దాయలేక, మరోవైపు థైస్ అందాలను కవర్ చేయలేక ఇబ్బంది పడుతుండగా, ఈ అమ్మడు ఇచ్చిన హాట్ పోజులు ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి. Shivathmika Rajashekar Birthday.
శివాత్మిక ఈ లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. వైరల్ అవుతున్నాయి. వీటితోపాటు బ్లాక్ డ్రెస్‌లోనూ ఈ బ్యూటీ ఇచ్చిన విరహ పోజులు మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. నెటిజన్ల చూపు తిప్పుకోలేకపోతున్నాయి. ఇంతటి హాట్ నెస్ చూడటం మా వల్ల కాదంటున్నారు కుర్రాళ్లు. శివాత్మిక విరహాలకు బేజార్ అయిపోతున్నారు.
హీరో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక. శివానీ రాజశేఖర్ మొదటి కూతురు అనే విషయం తెలిసిందే. అయితే శివానీ తొలుత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రయత్నం జరిగింది. ఆ సినిమా ఆగిపోవడంతో చెల్లి శివాత్మిక మొదటగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. `దొరసాని` అనే తెలంగాణ గడీల బ్యాక్‌డ్రాప్‌తో కూడిన కథతో తెరకెక్కిన `దొరసాని` చిత్రంతో దొర కూతురుగా శివాత్మిక నటించింది. సెటిల్డ్ నటనతో, అమాయకపు చూపులతో ఆద్యంతం ఆకట్టుకుంది.
పాత్రకి తగ్గట్టుగా అమాయకత్వం శివాత్మికలో ఉండటంతో పాత్ర బాగా పండింది. అందుకే ఫస్ట్ సినిమాతోనే మంచి ప్రశంసలందుకుంది శివాత్మిక. తొలి చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది శివాత్మిక. దీంతో ఆమెకి మంచి ఆఫర్లు వస్తున్నాయి. గ్లామర్ పాత్రలు కాకుండా బలమైన పాత్రలు ఆమెని వరిస్తుండటం విశేషం. ఆమె కూడా తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలను ఎంచుకోవడం విశేషం.
రాజశేఖర్, జీవిత సినిమా ఫ్యామిలీ కావడంతో చిన్నప్పట్నుంచి సినిమాలు చూస్తూ పెరిగింది శివాత్మిక. ఇంట్లో కంటే సెట్‌లోనే తమ జీవితం ఎక్కువగా గడిచిందని అప్పట్లో చెపిందీ అందాల నటి. ఆ ప్రభావం శివాత్మికపై పడింది. అందుకే స్టడీస్ వైపు కాకుండా సినిమాలవైపు వచ్చారు. యాక్టింగ్, డ్రామా స్కూల్‌కి వెళ్దామనుకుంది శివాత్మిక. ఆ టైమ్‌లోనే ఫ్రెష్ ఫేస్ కోసం చూస్తున్న `దొరసాని` టీమ్ వీరిని అప్రోచ్ కావడం, సినిమా చేయడం, అది విడుదల కావడం చక చకా జరిగిపోయింది.
సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో ఆ ఇమేజ్ వీరిపై ఉంటుంది. కానీ దాన్నుంచి బయటపడి, స్వతహాగా రాణించేందుకు ప్రయత్నిస్తుంది శివాత్మిక. అందుకే తనకంటూ సొంతంగా ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందుకు సోషల్ మీడియాని వేదికగా చేసుకుంది. ఇంటర్నెట్‌లో గ్లామర్ ఫోటోలతో రెచ్చిపోతుంది.
తన సహజమైన అందాల ఫోటోలను, గ్లామర్ చిత్రాలను, అప్పుడప్పుడు హాట్ హాట్ పిక్స్ ని షేర్ చేసుకుంటూ రెచ్చిపోతుంది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. పొట్టి దుస్తుల్లో ఈ బ్యూటీ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ అమ్మడిని చూసేందుకు లక్షల్లో నెటిజన్లు ఎగబడుతున్నారంటే ఏ రేంజ్‌లో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫాలోయింగ్ తగ్గట్టే ఆఫర్స్ కూడా వస్తున్నాయి. తెలుగులో శివాత్మిక `పంచతంత్రం` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు కృష్ణవంశీ రూపొందిస్తున్న`రంగ మార్తాండ`లోనూ కీ రోల్ చేస్తుంది. అలాగే తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ `ఆకాశం`అనే చిత్రం హీరోయిన్‌గా చేస్తుంది. దీంతోపాటు మరో కోలీవుడ్ సినిమా చేస్తుంది శివాత్మిక. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి, మరికొన్ని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక నేడు బర్త్ డే కావడంతో అభిమానులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విషెస్‌లు వెల్లువలా వస్తున్నాయి.