నిర్మాతలకు భారీ నష్టాలను కలిగించిన రీసెంట్ మూవీస్

First Published Sep 20, 2019, 1:02 PM IST

సినిమా సక్సెస్ అయ్యిందా లేదా అన్న విషయం పక్కనపెడితే నిర్మాతకు ఎంతవరకు లాభాలు వచ్చాయన్నదే ముఖ్యం. గత ఏడాది ఎండింగ్ నుంచి చూసుకుంటే నిర్మాతలకు ఎక్కువగా నష్టాలను కలిగించిన సినిమాల సంఖ్య పెద్దదిగానే ఉంది. 

హిందీలో తప్పితే సాహో మరెక్కడా లాభాలను అందించలేకపోయింది. ఏపీ నైజాం ఏరియాలో నష్టాల నుంచి తప్పించుకోవాలంటే సినిమా 35కోట్లకు పైగా రాబట్టాలి. కానీ సినిమా స్క్రీన్స్ మెల్ల మెల్లగా తగ్గుతున్నాయి. దీంతో ఆ నష్ఠాలను రికవర్ చేయడం సాధ్యం కానీ పని.
undefined
18కోట్ల బిజినెస్ తో టార్గెట్ సెట్ చేసుకున్న మన్మథుడు 2 - 10కోట్ల షేర్స్ ని కూడా అందించలేకపోయింది.
undefined
పడి పడి లేచే మనసుతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ రణరంగం సినిమాతో శర్వానంద్ మంచి హైప్ క్రియేట్ చేశాడు. అయితే విడుదల అనంతరం సినిమా పెద్దగా లాభాలను అందించలేకపోయింది. 16కోట్ల థ్రియేటికల్ వాల్యూ కలిగిన ఈ సినిమా 10కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్లు సమాచారం.
undefined
విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ డిజాస్టర్ నోట. తెలుగు తమిళ్ లో 20 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమాకు 12 కోట్లు మాత్రమే వచ్చాయి. ఎక్కువగా బయ్యర్స్ నష్టపోయారు.
undefined
కబాలి అనంతరం రజనీకాంత్ - పా రంజిత్ కాంబినేషన్ లో వచ్చిన కాలా సినిమా బడ్జెట్ 135 కోట్లు.. కానీ సినిమా కేవలం 85 కోట్ల షేర్స్ ని మాత్రమే అందించి డిస్ట్రిబ్యూటర్స్ ని కూడా ముంచేసింది.
undefined
నా పేరు సూర్య సునామి సృష్టిస్తుందని అంతా అనుకున్నారు. కానీ పెట్టిన బడ్జెట్ కూడా వెనక్కి రాలేదు. 65 కోట్ల పెట్టుబడికి 53 కోట్లు మాత్రమే వచ్చాయి.
undefined
మొదట్లో విక్రమ్ సామి స్క్వేర్ పై కూడా అంచనాలు బాగానే పెరిగాయి. అయితే సినిమా 50 కోట్లతో నిర్మించగా 27 కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి. విక్రమ్ కెరీర్ లో ఇదో పెద్ద డిజాస్టర్ లిస్ట్ లో చేరిపోయింది.
undefined
కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన విశ్వరూపం 2 మొదటి రోజే డిజాస్టర్ టాక్ ను అందుకోవడంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కనీసం 30 కోట్లను అందుకోకపోవడం గమనార్హం.
undefined
నాని నాగార్జున నుంచి వచ్చిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ విడుదల అనంతరం పెద్దగా హంగామా చేయలేకపోయింది. 35 కోట్ల ఈ సినిమా 25 కోట్ల షేర్స్ ను మాత్రమే అందుకుంది.
undefined
మొదటి పార్ట్  అంతగా ఆడకపోయినా సీక్వెల్ పై నమ్మకంతో ప్రయోగం చేసిన ధనుష్ మరో డిజాస్టర్ అందుకున్నాడు. మారి 2 బడ్జెట్ 35 కోట్లు కాగా 25 కోట్ల షేర్స్ మాత్రమే వచ్చాయి.
undefined
విక్రమ్ నుంచి వచ్చిన మరో సినిమా స్కెచ్ కూడా బాక్స్ ఆఫీస్ ముందు చతికిలపడింది. 30 కోట్ల ఈ సినిమా 20 కోట్లు కూడా వెనక్కి తీసుకురాలేదు.
undefined
వరుస విజయాలతో ఉన్న నానిని కృష్ణార్జున యుద్ధం గట్టిదెబ్బే కొట్టింది. బడ్జెట్ 25 కోట్లైతే 15 కోట్లు తేవడానికి ఈ సినిమా నన తంటాలు పడింది.
undefined
25 కోట్లతో తెరకెక్కిన నెల టికెట్టు రవితేజ మార్కెట్ కి తగ్గట్టు కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కేవలం 10 కోట్లు మాత్రమే వచ్చాయి.;
undefined
15 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మించిన అంతరిక్షం సినిమా కనిసం 10 కోట్లు వెనక్కి తీసుకురాలేకపోయింది.
undefined
శ్రీనువైట్ల - రవితేజ కాంబోలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని 20 కోట్ల బడ్జెట్ లో 13 కోట్ల వరకు నష్టాలను మిగిల్చిందని సమాచారం.
undefined
15 కోట్లతో నిర్మించిన తేజ్ ఐ లవ్ యు 10 కోట్ల నష్టాలను మిగిల్చినట్లు టాక్.
undefined
click me!