2023లో నష్టాలను మిగిల్చిన సినిమాలేంటీ? ఏఏ సినిమాకు ఎంత లాస్.. ఎక్కువ కోల్పోయిన చిత్రంగా..

First Published | Jun 6, 2023, 8:09 AM IST

ఈ ఏడాది ప్రారంభం నుంచి స్మమర్ వరకు కొన్ని చిత్రాలు బ్లాక్ బాస్టర్ గా నిలిస్తే.. మరికొన్నిమాత్రం కలెక్షన్ల పరంగా ఫెయిల్ అయ్యాయి. దీంతో భారీగా నష్టాలను చవిచూశాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటీ? ఎంత లాస్ జరిగిందంటే..

ప్రస్తుతం పెద్ద సినిమా అయినా.. చిన్న సినిమా అయినా థియేటర్లలోకి వచ్చిన మొదటి రెండు రోజుల్లోనే ఫలితాలు తెలిసిపోతున్నాయి. ఆడియెన్స్ ను మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా ఏ స్థాయిలో సక్సెస్ అవుతాయనేదానిపై సినీ విశ్లేషకులు, ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈక్రమంలోనే 2023 ప్రారంభం నుంచి సమ్మర్ వరకు భారీగా నష్టాలను మిగిల్చిన చిత్రాలపైనా కొన్ని డిటేయిల్స్  వైరల్ గా మారాయి. 

ఈఏడాది భారీ అంచనాలతో థియేటర్లలోకి అడుగుపెట్టిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). సమంత ప్రధాన పాత్రలో నటించింది. గుణశేఖర్ దర్శకత్వం వహించారు. గుణశేఖర్ తో పాటు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఏప్రిల్ 14న అన్ని భాషల్లో విడుదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకోగలిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం ఫెయిల్ అయ్యిందని తెలిసిందే. రూ.65 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం కేవలం రూ.20 కోట్ల వరకే వసూళ్లు రాబట్టింది. దీంతో నిర్మాతలకు రూ.45 నుంచి రూ.50 కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్టు తెలుస్తోంది. 

Latest Videos


భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చిన రెండో చిత్రం అఖిల్ అక్కినేని (Akhil Akkineni)   ‘ఏజెంట్’గా తెలుస్తోంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈచిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖిల్ ఈ చిత్రం కోసం బాగా కష్టపడ్డారు. కానీ ఫలితం బెడిసికొట్టింది. రూ.60 కోట్లకు పైగా నిర్మాత రాంబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర నిర్మించారు. చివరి ఈ చిత్రం రూ.33 కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చిందని తెలుస్తోంది. మరోవైపు మేకర్స్, అఖిల్ కూడా ఈ మూవీ ఫెయిల్ అవ్వడాన్ని ఒప్పుకోవడం గమనార్హం.

మంచి హిట్ కోసం ఎదురుచూసిన అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ‘కస్టడీ’(Custody)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంట్రెస్టింగ్ కథతో వచ్చినప్పటికీ పూర్తి స్థాయి ఆడియెన్స్ ను అలరించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాల్సి వచ్చింది. ఈ చిత్రం రూ.18 కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చిందని అంటున్నారు. 

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన ‘రామబాణం’ (Rama Banam) కూడా నిర్మాతలకు లాస్ నే మిగిల్చింది.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు. రిలీజ్ ముందు కాస్తా హైప్ క్రియేట్ చేసినా బాక్సాఫీస్ వద్ద మాత్రం నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని తెలుస్తోంది. దాదాపు రూ.16 కోట్ల వరకు ప్రొడ్యూసర్ కు లాస్ వచ్చిందని అంటున్నారు. మే 5న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. గోపీచంద్ - జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. డింపుల్ హయాతీ హీరోయిన్ గా అలరించింది. 

మాస్ మహారాజా ఎప్పుడూ సినిమా పరంగా ప్రయోగాలు చేసేందుకు ముందుంటారు. కొత్త  కథలను, కొత్త జానర్లలో ప్రేక్షకులను అలరించేందుకు తపన పడుతుంటారు. ఈక్రమంలో రీసెంట్ గా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణసుర’ (Ravanasura)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏప్రిల్ 7న విడుదలైంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. కాగా ఈ చిత్రంతో రూ.11  కోట్ల వరకు నిర్మాతకు లాస్ అయ్యిందని సినీ వర్గాల సమాచారం. 
 

click me!