సమంతని ఇంటిసభ్యులకు పరిచయం చేశారు నాగార్జున. తాను లేనప్పుడు ఇంటి బాధ్యతలు ఇంటి కోడలకు అప్పగిస్తామని, అలా బిగ్‌బాస్ బాధ్యతులు సమంతకిఅప్పగించామని చెప్పారు. సమంత ఇంటి సభ్యులను పరిచయం చేసుకున్నారు. ఒక్కొక్కరి గురించి చెప్పారు. అందరిపై సెటైర్లు వేశారు. ముఖ్యంగా అరియానా తనలా ఉందనిచెప్పారు.
అరియానాని చూస్తుంటే తననే చూసినట్టు ఉందని చెప్పింది. కొంటె పనులు, అల్లరి తనలాగే ఉన్నాయన్నారు. ఇద్దరి మధ్య దగ్గరి క్వాలిటీస్ ఉన్నాయని తెలిపింది. దివి గురించిచెబుతూ, అందంగా ఉన్నావని, గేమ్‌పై పెట్టాలన్నారు. హారిక గురించి చెబుతూ, ఈ వారం సరిగా ఆడలేదని చెప్పింది. లాస్యది కన్నింగ్ స్మైల్ కాదని, విన్నింగ్ స్మైల్‌లా ఉందనిచెప్పింది. సేఫ్‌గా కాదు బాగా ఆడాలన్నారు. మోనాల్ గురించి చెబుతూ, బిగ్‌బాస్ చాలా నేర్పిస్తుందని, ప్రేమించడం నేర్పిస్తుందన్నారు.
బాయ్స్ ని మాత్రం ఓ రేంజ్‌లో ఆడుకుంది సమంత. అబ్బాయిల్లో తమలోని స్ట్రెన్త్, వీక్‌నెస్ చెప్పాలన్నారు. సోహైల్ హ్యాపీగా ఉండటం, చర్చల్లో తాను ముందుంటానని, జరిగిందిమర్చిపోతానని తెలిపాడు. వీక్‌నెస్ నరాలు ఉప్పొగ్గుతాయని, నాగార్జునగారి వల్ల ఇప్పుడు తగ్గాయన్నారు. అభిజిత్ ఈ వారం చాలా స్పెషల్ అని, ప్రపంచంలోనే అత్యంతఅందమైన స్మైల్ సమంతదని సమంతకే పులిహోర కలిపాడు. ప్లస్ డిసిప్లెయిన్, నెగటివ్ కోపమన్నారు.నోయల్ చెబుతూ, పాజిటివ్‌గా ఉంటానని, అందరు బాగుండాలని కోరుకుంటానని, ఫ్యామిలీని మిస్ కావడం మైనస్ అని చెప్పింది. ఈ సందర్భంగా సమంత చెబుతూ మీరు గురువు కావాలని సెటైర్ వేశారు. ఇక అవినాష్ వంతు వచ్చింది. ఆయన సోఫాపై రాయడంపై సెటైర్లు వేశారు. తన ప్లస్ ఆడియెన్స్ అని, వీక్‌నెస్ ఫ్యామిలీ, కోపం అని తెలిపింది.
`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` గేమ్ పెట్టారు. ఇందులో మూడు స్టెప్పులుంటాయని, అందులో గెలిచినవారు విన్నర్ అని చెప్పారు. అందులో ఒకటి స్వయం వరం. ఇందులోఐదుగురు కుర్రాళ్లు అవినాష్, సోహైల్, మెహబూబ్, అభిజిత్, అఖిల్ ఒక్కొకరు.. నలుగురు అమ్మాయిలు మోనాల్, హారిక, అరియానా, దివిలను ఇంప్రెస్ చేయాల్సి ఉంది.ఇందులో అఖిల్ విన్నర్‌గా నిలిచారు. విన్నర్ కి బిగ్‌బాస్ గిఫ్ట్ ఇచ్చాడు. వారి కుటుంబ సభ్యుల వీడియోలను చూపించారు. దీంతో ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు.
ఇక గెస్ట్ గా వచ్చిన అఖిల్.. కాసేపు సందడి చేశాడు. తన `మోస్ల్ ఎలిబుల్ బ్యాచిలర్` విశేషాలు తెలిపారు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా పాల్గొని ముచ్చటించారు.
ఆ తర్వాత గేమ్‌లో `పోటుగాడు ఎవరు` అనే గేమ్ పెట్టారు. ఇందులో అబ్బాయిలకు క్విజ్ పెట్టారు. అందులో అఖిల్ విన్ అయ్యాడు. మరోవైపు బెస్ట్ డాన్స్ జోడీ గేమ్‌లోఅబ్బాయిలు, అమ్మాయిలు నాలుగు జోడీగా విడగొట్టి వారితో డాన్స్ లు వేయించారు సమంత. అందులో బెస్ట్ జోడీని ఎంపిక చేయాల్సి ఉంది. అందులో సమంతతోపాటు అఖిల్‌గెస్ట్ గా వచ్చారు. ఇందులో అవినాష్, హారిక జోడీగా స్టెప్పులేశారు. తమ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉంటుందన్నారు. అఖిల్, మోనాల్ కలిసి స్టెప్పులేశారు. అఖిల్‌కి ఆ పేరుఎలా వచ్చిందో హీరో అఖిల్ అడిగాడు. `సిసింద్రి` సినిమా టైమ్‌లో తాను పుట్టానని ఆ అభిమానంతో ఆ పేరు పెట్టారని అఖిల్ చెప్పాడు.
ఆ తర్వాత అభిజిత్, దివి కలిసి డాన్స్ చేశారు. అభిజిత్ డాన్స్ పై సమంత సెటైర్ వేశారు. డాన్స్ లో తోపు అట అని పంచ్ పేల్చారు. ఈ డాన్స్ ని చూడా తమకి కూడా మైండ్‌బ్లాంక్ అయ్యిందని అమ్మా రాజశేఖర్ బాంబ్ పేల్చారు. తక్కువ మాట్లాడటం వల్ల అభిజిత్ నచ్చుతాడని దివి చెప్పింది. ఇక అరియానా, మెహబూబ్ కలిసి స్టెప్పులేశారు. ఇద్దరుబాగా డాన్స్ చేసి మెప్పించారు. ఇద్దరం ఎప్పుడూ గొడపడతామని మెహబూబ్ చెప్పారు. కాంపిటేటివ్ స్పిరిట్ మెహబూబ్‌లో నచ్చుతుందని అరియానా చెప్పారు. మొత్తంగాఇందులో అఖిల్ విన్నర్ అని అఖిల్ చెప్పారు.
ఆ తర్వాత దసరా స్పెషల్‌లో హాట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ని దించారు. ఆమె ఘాటైన డాన్స్ లతో అదరగొట్టారు. మరోవైపు హీరో కార్తికేయ సైతం డాన్స్ తో ఎంట్రీఇచ్చారు. అలాగే పంచ్‌ల కింగ్ హైపర్ ఆది సైతం స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి పంచ్‌లతో సందడి చేశారు. బిగ్‌బాస్ హైజ్‌లో మొన్నటి వరకు పులిహోర కలిపేది ఎక్కువగాఅభిజిత్, లాస్య, అఖిల్ పేర్లు వినిపించాయి. కానీ హైపర్ ఆది షాక్ ఇచ్చాడు. తన జబర్దస్త్ మేట్ అయిన అవినాష్ పై భారీ పంచ్ వేశాడు.
కనిపించవుగానీ, హౌజ్‌లో కిచెన్‌లో ఎక్కువగా పులిహోర కలిపేది అవినాషే అని చెప్పేశాడు. దీంతో అవినాష్ షాక్‌కి గురయ్యాడు. ఇలా వరుసగా ఒక్కొక్కరిపై పంచ్‌ల వర్షంకురిపించాడు. హైపర్ ఆది డిటెక్టివ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇంటిసభ్యుల గురించి చెప్పాలని హోస్ట్ సమంత చెప్పడంతో ఒక్కొక్కరి గురించి చెప్పారు.సోహైల్ గురించి చెబుతూ, వచ్చిన కొత్తలో `అర్జున్‌రెడ్డి`లాగా ఉండేవాడివనీ, ఇప్పుడు `స్వాతిముత్యం`లా మారిపోయావ`న్నారు. కోపాన్ని కంట్రోల్ చేసుకున్నావు కాబట్టిటీవీలో ఉన్నవాని, లేదంటే ఇంట్లో టీవీ ముందు ఉండేవాడని పంచ్ వేశాడు. మెహబూబ్ గురించి చెబుతూ, కొంటె రాక్షసుల గేమ్‌లో అవినాష్‌లో కొంటె తప్ప రాక్షసుడు లేడని,మెహబూబ్‌లో రాక్షసుడు తప్ప కొంటె లేడని చెప్పేశాడు.
ఇక అమ్మ రాజశేఖర్‌పై కూడా పెద్ద పంచ్ పేల్చాడు. అమ్మా.. దివికి బాగా కనెక్ట్ అయ్యిందని తెలిపాడు. దివి కనెక్షన్‌లో పడి రోబోల ఆటలో అవినాష్ ఛార్జింగ్ పెట్టుకున్నవిషయం కూడా చూసుకోలేదని పంచ్ వేశాడు. ఇక అఖిల్ గురించి చెబుతూ, అఖిల్‌కి, మోనాల్‌కి మధ్య సింగ్ బాగా కుదిరిందని చెప్పాడు. ఒకరు ఉంటే మరొకరుంటారని,వేర్వేరుగా వెతకాల్సిన పనిలేదన్నారు. మోనాల్ తనని మొదట కలిసినప్పుడు కిడ్నాపర్‌లా చూసిందన్నారు.
`బిగ్‌బాస్ బ్లాక్‌బస్టర్` సినిమా షూటింగ్‌లో క్లైమాక్స్ `నా పెళ్ళికి రండి` అని మోనాల్ చెప్పిందని, అప్పుడు అభిజిత్ `నా కాదు, మా పెళ్ళి అని చెప్పాల`ని చెప్పాడు. కానీఅప్పుడు మోనాల్ కరెక్టే చెప్పారు. ఆమె లిస్ట్ లో మీరెవరూ లేరని మరోక్షంగా చెప్పిందని పంచ్ వేశాడు. దీంతో అఖిల్ మొఖం వాడిపోయినంత పని అయ్యింది.
ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేట్ ప్రక్రియలో అరియానా, అభిజిత్, మోనాల్, నోయల్ సేఫ్ అయ్యారు. ఉత్కంఠభరిత గేమ్ మధ్య అవినాష్, దివి ఎలిమినేట్ పోటీలో పాల్గొనగా,దివి ఎలిమినేట్ అయ్యారు. ఈ సందర్భంగా అమ్మా రాజశేఖర్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆమె పోతూ పోతూ.. బిగ్‌బాంబ్ లాస్యపై వేశారు. నెక్ట్స్ వారం మొత్తం వంట చేయాలనేదిబిగ్‌బాంబ్ కండీషన్. ఇలా ఆటాపాటాలు, గేమ్‌లు, సర్ ప్రైజ్‌లతో ఈ మహా ఎపిసోడ్ ముగిసింది.