నువ్వెందుకు ఫైర్‌ అవుతున్నవ్‌ రా బై.. ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్‌!

First Published Oct 30, 2020, 10:12 PM IST

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 54వ రోజు  మోనాల్‌, అఖిల్‌, అభిజిత్‌ మధ్య వివాదం ఇక ముగిసింది. మరోవైపు ఇంటి సభ్యుల మధ్య బిగ్‌బాస్‌ పెద్ద చిచ్చే పెట్టాడు. 

బిగ్‌బాస్‌ 4 54వ రోజు ఇంటిసభ్యులకు విచిత్రమైన టాస్క్‌ పెట్టాడు బిగ్‌బా. ఇంటి సభ్యులను ఐదు జంటలుగా చేసి వారికి సూట్‌ అయ్యే ట్యాగ్‌లు పెట్టాలని, ఎందుకు పెడుతున్నారో చెప్పాలన్నారు.దీంతో బిగ్‌బాస్‌ పిలిచిన జంటలు మిగిలినజంటలకు అక్కడ ఉన్న ట్యాగ్‌లను తగిలించారు. మొదటగా వచ్చిన అభిజిత్‌, హారిక లు కలిసి అమ్మా రాజశేఖర్‌, లాస్యలకు గజిబిజి ట్యాగ్‌లు ఇచ్చారు. వీరిద్దరు చాలా విషయాల్లో గజిబిజీగా ఉంటారని చెప్పారు.
undefined
మెహబూబ్‌, సోహైల్‌ వచ్చి.. అవినాష్‌, అరియానాలకు బద్దకపు జంట ట్యాగ్‌ని తగిలించారు.
undefined
అవినాష్‌, అరియానా పని విషయంలో లేజీగా ఉంటారని, వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. అయితే కొన్ని సార్లు అవినాష్ చేస్తే ఎక్కువ చేస్తాడని, కానీ ఎక్కువ సార్లు మాత్రం పని తప్పించుకుంటారని తెలిపారు.
undefined
అఖిల్‌, మోనాల్‌ వచ్చి.. సోహైల్‌, మెహబూబ్‌ జంటలకు అబద్దాల కోరు జంట ట్యాగ్‌ని ఇచ్చారు.
undefined
వారు చాలా విషయాల్లో అబద్దాలు చెబతారని, తాను సేఫ్‌ గేమ్‌ ఆడటం కోసం ఇతరుల విషయాల్లో అబద్దాలు చెబుతారని తెలిపారు. మెహబూబ్‌ విషయంలో తనకు అండర్‌ స్టాండింగ్‌ లేదని మోనాల్‌ తెలిపింది.
undefined
అవినాష్‌, అరియానా వచ్చి.. అఖిల్‌, మోనాల్‌లకు అహాంకారం జంట ట్యాగ్‌ని ఇచ్చారు.
undefined
అఖిల్‌కి కోపం ఎక్కువని, వారు మాట్లాడే విధానం సరిగ్గా ఉండదన్నారు. మోనాల్‌ విషయంలో కూడా అదే చెప్పారు. చిన్న వాటికే కోపానికి గురవుతారని తెలిపారు.
undefined
అమ్మా రాజశేఖర్‌, లాస్య వచ్చి.. అభిజిత్‌, హారికలకు జీరో టాలెంట్‌ ట్యాగ్‌లను ఇచ్చారు. అయితే ఈ ట్యాగ్‌ వారికి సూట్‌ కాదు గానీ, ఇంకా మరేది లేకపోవడంతో ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని సార్లు మాత్రం జీరో టాలెంట్‌ లాగానే బిహేవ్‌ చేస్తారని, మరికొన్ని సార్లు అభిజిత్‌ చాలా మైండ్‌ గేమ్‌ ఆడతాడని అమ్మా రాజశేఖర్‌ తెలిపారు.
undefined
అనంతరం ఆయా ట్యాగ్‌లను తీసుకొచ్చి వారి మెడల్లో వేయాలన్నారు. అయితే వారికి వచ్చిన ట్యాగ్‌లు కరెక్ట్ కాదని నిరూపించుకునేందుకు బిగ్‌బాస్‌ మరో అవకాశం ఇచ్చారు.ఇకపై అహాంకారం ఉన్నవాళ్ళు బిగ్‌బాస్‌ చెప్పినప్పుడు తాము అహాంకార జంట కాదని నిరూపించుకోవాలన్నారు. అలాగే జీరో టాలెంట్‌ జంట బిగ్‌బాస్‌ చెప్పినప్పుడు తాము జీరో టాలెంట్‌ కాదని, అలాగే అబద్దాలు చెప్పేవారు బిగ్‌బాస్‌ చెప్పినప్పుడు తాము అబద్దాలు చెప్పమని, నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పాలన్నారు. బద్దకం జంట బిగ్‌బాస్‌ చెప్పినప్పుడు అన్ని పనులు చేయాలన్నారు. ఈ క్రమంలో అఖిల్‌, మోనాల్‌లను డిస్టర్బ్ చేయడానికి సోహైల్‌ ఎంతగానో ప్రయత్నించాడు. నేను అబద్దాలు ఎప్పుడు చెప్పానంటూ అఖిల్‌పై ఫైర్‌ అయ్యారు. దీంతో ఈ టాస్క్ ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టినట్టయ్యింది.
undefined
click me!