పెళ్లి వార్తలపై వనితా విజయ్‌ కుమార్‌ మండిపాటు.. 40పెళ్లిళ్లంటూ బిగ్‌బాస్‌ భామ సంచలన వ్యాఖ్యలు..

Published : Jul 25, 2021, 08:08 PM IST

వనితా విజయ్‌ కుమార్‌.. వరుస పెళ్లిళ్లతో సంచలనంగా మారారు. ఇటీవల తమిళ నటుడు పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ని వివాహం చేసుకున్నట్టు కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలు వివాదాస్పదం కావడంతో తాజాగా దీనిపై వనితా విజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.   

PREV
18
పెళ్లి వార్తలపై వనితా విజయ్‌ కుమార్‌ మండిపాటు.. 40పెళ్లిళ్లంటూ బిగ్‌బాస్‌ భామ సంచలన వ్యాఖ్యలు..
సీనియర్‌ నటుడు విజయ్‌ కుమార్‌ కుమార్తె వనితా విజయ్‌ కుమార్‌. నటి శ్రీదేవికి సిస్టర్‌. గొప్ప నటుడు ఫ్యామిలీ నుంచి వచ్చిన వనితా విజయ్‌ కుమార్‌ జీవితం మాత్రం ఎప్పుడూ వివాదాస్పదంగానే మారింది

28
ఆమె ప్రేమ, పెళ్లిళ్లే వివాదంతో కూడిన సంచలనంగా మారాయి. ఇప్పటి వరకు ముగ్గురిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వనితా, ముగ్గురికి విడాకులిచ్చింది. తాను ప్రేమలో విఫలమయ్యాయని, ప్రేమించి మోసపోయానని వాపోయింది. ఆ మధ్య తన ఆవేదన చెందింది. ఇక మళ్లీ పెళ్లి చేసుకోనని వెల్లడించింది.

38
ఈ నేపథ్యంలో ఈ మధ్య తమిళ నటుడు పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ని ఆమె పెళ్లి చేసుకున్నట్టు కథనాలు వచ్చాయి. కోలీవుడ్‌, టాలీవుడ్‌ని ఈ వార్తలు షేక్‌ చేశాయి. నాల్గో పెళ్ళి అంటూ వచ్చిన వార్తలు వైరల్‌ కావడంతో వనితపై అనేక విమర్శలు వచ్చాయి. బయటకు చెప్పిందేంటి? చేస్తుందేంటి? అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో విరుచుకుపడ్డారు.

48
అయితే ఈ పెళ్లి నిజం కాదని, సినిమా స్టిల్‌ అని ఆమె వివరణ ఇచ్చింది. పవర్‌స్టార్‌ దర్శకత్వంలో తాను నటిస్తున్న `పికప్‌ డ్రాప్‌` అనే చిత్రానికి సంబంధించిన ఫోటోలని వివరణ ఇచ్చింది. సినిమా ప్రమోషన్‌ కోసం అలా చేయాల్సి వచ్చిందని తెలిపింది.

58
అదే సమయంలో తనపై వచ్చిన విమర్శలపై వనితా విజయ్‌ కుమార్‌ ఘాటుగా స్పందించింది. `ఇద్దరు నటీనటులు కలిసి ఫొటోలు తీసుకుని, వాటిని విడుదల చేస్తే పెళ్ళి జరిగినట్టా? ఇలాంటి విషయాలను చర్చనీయాంశంగా మార్చాల్సిన అవసరం లేదని తెలిపింది.

68
ఇంకా చెబుతూ, `వ్యక్తిగత జీవితంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రం అవసరం. ఒక పురుషుడు నాలుగైదు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటికీ రాద్దాంతం చేయరు. ఆ పని ఒక మహిళ చేస్తే మాత్రం వివాదం సృష్టిస్తార`ని మండిపడింది.

78
`నేను నాలుగు కాదు... 40 పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటా. అది నా హక్కు. మహిళల గురించి ఈ సమాజం ఇంకా చెడుగా మాట్లాడుతుండటం వల్లే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఒకరితో జీవితాన్ని పంచుకుంటూ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే తప్పు. ఈ మాట ఎందుకు చెపుతున్నానో మీకై అర్థమైవుంటుంది. నాకు ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదు` అని వనితా విజయకుమార్‌ స్పష్టం చేసింది.

88
దీనిపై పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ కూడా స్పందించారు. ఈ సమాజంలో నూటికి 90 మంది సక్రమైన మార్గంలో పయనించడం లేదని, ఇవన్నీ బయటకు చెప్పకుండానే రహస్యంగా జీవిస్తున్నారని బోల్డ్‌ కామెంట్‌ చేశారు. ఈ విషయంలో వనితా విజయ్‌ కుమార్‌ని ఆయన `ఐరన్‌ లేడీ`గా అభివర్ణించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories