బిగ్‌బాస్‌ ఉత్సవం 2ః అందరి ముందు శ్రీముఖి పరువు తీసిన రోహిణి.. పాపం యాంకర్‌కి మతిపోయింది!

Published : Feb 09, 2021, 07:42 PM IST

`బిగ్‌బాస్‌4` రీయూనియన్‌ ఈ ఆదివారం గ్రాండ్‌గా జరిగింది.  నెక్ట్స్ వీక్‌ పార్ట్ 2 పేరుతో మిగిలిన మూడు సీజన్ల కంటెస్టెంట్లందరితో మరో ఈవెంట్‌ చేశారు. ఇందులో శ్రీముఖి, రోహిణిల మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా మారాయి. వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఆ ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటుంది. 

PREV
18
బిగ్‌బాస్‌ ఉత్సవం 2ః అందరి ముందు శ్రీముఖి పరువు తీసిన రోహిణి.. పాపం యాంకర్‌కి మతిపోయింది!
బిగ్‌బాస్‌ ఉత్సవం పార్ట్ 2లో శ్రీముఖి, రోహిణి ల మధ్య వచ్చే ఇంట్రో సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు వేసుకున్న సెటైర్లు వైరల్‌ అవుతున్నాయి.

28
ఇందులో `అదేంటే.. ఇంట్లో ఉన్నప్పుడు సన్నగా ఉండేదానివి.. ఇప్పుడేంటో రుబ్బురోలులా అయిపోయావని` అని రోహిణిని ఉద్దేశించి శ్రీముఖి కామెంట్‌ చేయగా, `నువ్వు మాత్రం ఏం మారలేదు. అప్పుడూ రుబ్బు రోలే.. ఇప్పుడూ రుబ్బురోలే.. ` అంటూ పంచ్‌ వేసింది.

38
అందరి ముందే ఇలా రోహిణి వేసిన పంచ్‌కి శ్రీముఖికి మతిపోయింది. ఇంకా చెప్పాలంటే దిమ్మతిరిగిపోయింది. దీంతో శ్రీముఖి ముఖం మాడిపోయింది. ఈ పంచ్‌లకు ఇతర కంటెస్టెంట్లంతా ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు.

48
ఇక ఈ `బిబిఉత్సవం2`లో సీజన్‌ వన్‌, సీజన్‌ 2, సీజన్‌ 3 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. నాల్గో సీజన్‌ `బీబీఉత్సవం`లో దాదాపు అందరు పాల్గొనగా, పార్ట్ 2లో మాత్రం కొంత మంది మాత్రమే కనిపిస్తుంది.

58
మొదటి భాగంతో పోల్చితే రెండో భాగంలో అంత రసవత్తరంగా లేదని, తేలిపోయినట్టుందని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. కేవలం ఫన్‌ సన్నివేశాలపై ఫోకస్‌ చేసినట్టు ప్రోమోని చూసి తెలుస్తుంది.

68
కానీ నాల్గో సీజన్‌ కంటెస్టెంట్లు మాత్రం ఫన్‌, కామెడీ, ఎమోషనల్‌ సన్నివేశాలతో సాగింది. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కంటెస్టెంట్లు కన్నీరు పెట్టుకున్నారు. ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకున్నారు.

78
చూడబోతే రెండో పార్ట్ లో ఇవన్నీ లేవని కేవలం టాస్క్ లు, గేమ్‌లతో నడిపించినట్టు తెలుస్తుంది.

88
ఇందులో బిగ్‌బాస్‌ మొదటి విన్నర్‌ శివబాలాజీ, రెండో సీజన్‌ విన్నర్‌ కౌశల్‌, మూడో సీజన్‌ విన్నర్‌ రాహుల్‌, పునర్నవి, గీతా మాధురి, ధన్‌రాజ్‌, రోహిణి, శ్రీముఖి, ప్రిన్స్, సావిత్రి వంటి వారు పాల్గొన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories