Karishma Tana Wedding: గ్రాండ్‌గా `నాగిని` ఫేమ్‌ కరిష్మా తానా వెడ్డింగ్‌.. ఫోటోలు వైరల్‌..

Published : Feb 07, 2022, 04:47 PM IST

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ, `నాగిని`, `బిగ్‌బాస్‌` ఫేమ్‌ కరిష్మా తానా మ్యారేజ్‌ గ్రాండ్‌గా జరిగింది. ముంబయికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ మ్యాన్‌ వరుణ్‌ బంగేరాని వివాహం చేసుకుంది. 

PREV
18
Karishma Tana Wedding: గ్రాండ్‌గా `నాగిని` ఫేమ్‌ కరిష్మా తానా వెడ్డింగ్‌.. ఫోటోలు వైరల్‌..

 శుక్రవారం వీరి మ్యారేజ్‌ ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌లో అత్యంత వైభవంగా జరిగింది. కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది బంధుమిత్రులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీరి వెడ్డింగ్‌ జరగడం విశేషం. ప్రస్తుతం కరిష్మా, వరుణ్‌ బంగేరాల వెడ్డింగ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

28

టీవీ సీరియల్స్, టీవీ షోస్‌, సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇలా అన్ని రకాల ఎంటర్‌టైన్‌మెంట్‌ మాధ్యమాల్లో నటిస్తూ సందడి చేస్తుంది కరిష్మా తానా. టీవీ ఆడియెన్స్ కి, నెటిజన్లకి బాగా దగ్గరైంది. ఇంటర్నెట్‌లో భారీ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అందుకు పాపులర్‌ షోస్లో ఆమె పాల్గొనడమే అని చెప్పొచ్చు. 

38

ఇక గతేడాది నుంచి ముంబయికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ మ్యాన్‌ వరుణ్‌ బంగేరాని కరిష్మా ప్రేమిస్తుంది. వీరిద్దరు దాదాపు ఏడాదిపాటు డేటింగ్‌ చేశారు. గతేడాదిలోనే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఇక ఫిబ్రవరి 5న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఆయా ఫోటోలను కరిష్మా తానా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి వైరల్‌ అవుతున్నాయి. 

48

ఆమె అభిమానులు, సినీ, టీవీ సెలబ్రిటీలు ఈ నూతన జంటని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మొత్తంగా బాలీవుడ్‌ మీడియాలో కరిష్మా వెడ్డింగ్‌ హాట్‌ టాపిక్‌గా, ట్రెండింగ్‌గా మారింది.

58

గుజరాతీ ఫ్యామిలీకి చెందిన కరిష్మా తానా.. మోడలింగ్‌ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 2001లో `క్యుంకి సాస్ భి కభీ బహు తి` అనే సీరియల్‌ ద్వారా హిందీ ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది. ఇందులో ఆమె ఇందిరా పాత్రలో నటించింది. ఆ తర్వాత `కభీ తో మిలేంగే` అనే సీరియల్‌, ఆ తర్వాత `మన్షా` సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 

68

వరుసగా అనేక పాపులరి హిందీ సీరియల్స్ లో నటించి మెప్పించింది. అందులో `బిగ్‌బాస్‌` షో కూడా ఉంది. దీనితో మరింత గుర్తింపుని పాపులారిటీని పొందింది.  అంతేకాదు హిందీలో పాపులర్‌ టీవీ సీరియల్‌ `నాగిని 3`లో రూహి పాత్రలో మెరిసింది. ఇది ఆమెకి మరింత క్రేజ్‌ని తీసుకొచ్చింది. 

78

సీరియల్స్ తోపాటు సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. `దోస్తీః ఫ్రెండ్స్ ఫరెవర్‌` లో మెరిసింది. ఆ తర్వాత `గ్రాండ్‌ మస్తీ`, `గోల్లు ఔర్‌ పప్పు`, `సంజు`, `సురజ్‌ పే మంగల్‌ భరి`, `లాహోర్‌ కాన్ఫిడెన్షియల్‌` చిత్రాల్లో నటించింది. 
 

88

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ, `నాగిని`, `బిగ్‌బాస్‌` ఫేమ్‌ కరిష్మా తానా మ్యారేజ్‌ గ్రాండ్‌గా జరిగింది. ముంబయికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ మ్యాన్‌ వరుణ్‌ బంగేరాని వివాహం చేసుకుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories