సెట్‌లో ఆ డైరెక్టర్‌ అలా టార్చర్‌ చేసేవాడు.. తట్టుకోలేక ఇంటికొచ్చి ఏడ్చేదాన్ని.. బిగ్‌బాస్‌ బ్యూటీ ఆవేదన

Published : May 12, 2022, 08:27 PM ISTUpdated : May 12, 2022, 09:08 PM IST

`చీకటి గదిలో చితక్కొట్టుడు` ఫేమ్‌ నిక్కీ తంబోలీ తనకు షూటింగ్‌లో ఎదురైనా చేదు జ్ఞాపకాలను పంచుకుంది. ఓ దర్శకుడు తనతో ఎంత నీచంగా ప్రవర్తించాడో తెలిపింది. అసలు విషయాలను వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.

PREV
15
సెట్‌లో ఆ డైరెక్టర్‌ అలా టార్చర్‌ చేసేవాడు.. తట్టుకోలేక ఇంటికొచ్చి ఏడ్చేదాన్ని.. బిగ్‌బాస్‌ బ్యూటీ ఆవేదన

తెలుగులో `చీకటి గదిలో చితక్కొట్టుడు`, `కాంచన 3`, `తిప్పరామీసం` చిత్రాలతో ఆకట్టుకుంది నిక్కీ తంబోలీ(Nikki Thamboli). హాట్‌, బోల్డ్ రోల్స్ కి కేరాఫ్‌గా నిలుస్తుంది. గతేడాది హిందీలో బిగ్‌బాస్‌లోనూ పాల్గొని ఆకట్టుకుంది. బిగ్‌బాస్‌ 14లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచిన నిక్కీ తంబోలీ.. తాజాగా ఓ పెద్ద షాకింగ్‌ విషయం వెల్లడించింది. తనకు షూటింగ్‌లో జరిగిన అవమానాలను వెల్లడించింది.

25

తనని ఓ సౌత్‌ డైరెక్టర్‌ దారుణంగా అవమానించేవాడని, చాలా నీచంగా చూసేవాడని తెలిపింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించింది. అప్పటి సంఘటనలు ఇంకా గుర్తున్నాయని, సౌత్‌డైరెక్టర్‌ తనతో ప్రవర్తించిన తీరు అస్సలు నచ్చలేదట. సెట్‌లో డాన్సర్లందరినీ మెచ్చుకుంటున్నారని, కానీ తనని మాత్రం ఎక్కడి నుంచి వస్తారో నీలాంటి వాళ్లు? అంటూ చాలా చులకన చేసి మాట్లాడేవాడని తెలిపింది. 

35

అయితే తనకు ఆ భాష వచ్చేది కాదు, మాట్లాడటం ఇబ్బందిగా ఉండేది. కానీ ఆ దర్శకుడు చాలా చెత్తగా ప్రవర్తించాడు. విదేశాల్లో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో తనని చాలా చీప్‌గా చూస్తూ దారుణంగా ప్రవర్తించేవాడని పేర్కొంది. షూటింగ్‌ నుంచి ఇంటికొచ్చాక చాలా ఏడ్చేదాన్ని అని పేర్కొంది. 
 

45

ఎంత అవమానం జరిగినా, ఎంత నీచంగా చూసినా తాను మాత్రం వెనకడుగు వేయలేదని, ఎప్పటికైనా అతను తన తప్పు తెలుసుకుని ఫీల్‌ అవుతాడని భావించినట్టు చెప్పింది. ఇప్పటికీ ఆయన నాకు మెసేజ్‌లు చేస్తూనే ఉన్నాడు. కాలం అన్నింటినీ మార్చేస్తుంది` అని తెలిపింది నిక్కీ తంబోలీ. ప్రస్తుతం ఆమె చెప్పిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

55

చిత్ర పరిశ్రమలో `మీటూ` ఉద్యమం ఎంతగా నడిచిందో తెలిసిందే. నాలుగేళ్ల క్రితం ఇది బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ వినిపించింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. కోలీవుడ్‌లోనూ వినిపించాయి. మరోవైపు సినిమా షూటింగ్‌లో హీరోయిన్లకి ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. కానీ ఎవరూ ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పలేరు. చెబితే తమ కెరీర్‌ ఎక్కడ నాశనమవుతుందో అనే భయం ఉంటుంది. ఎప్పటికో ఫేడౌట్‌ అయ్యాక నెమ్మిదిగా ఆ విషయాలను చెబుతూ సంచలనాలకు తెరలేపుతుంటారు. ఇప్పుడు నిక్కీ కూడా అలాంటి సంచలనాలకే తెరలేపుతుందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories