ఆ తర్వాత ‘మన్మధుడు 2, మిస్ ఇండియా, రంగ్ దే, గుడ్ లక్ సఖి’ చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలేవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ‘మహానటి’ క్రేజ్ కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది. అయితే తను ఎంచుకుంటున్న పాత్రలే ఇందుకు కారణం అంటూ సినీ ప్రముకులు అంటున్నారు. సినిమాల ఎంపికలో అజాగ్రత్త వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు.