బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీ చూడ్డానికి బార్బీ డాల్‌లా ఉంటుందా? నెటిజన్ కామెంట్‌..

First Published | Mar 15, 2021, 6:10 PM IST

క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేసే బిగ్‌బాస్‌4 ఫేమ్‌ అరియానా గ్లోరీపై రకరకాల కామెంట్లు వస్తూనే ఉన్నాయి. కానీ తాజాగా ఆమెని విచిత్రంగా సంభోదించారు. చూడ్డానికి ఈ సన్నజాజి బొమ్మ బార్బీ డాల్‌లా ఉందట. అరియానా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు రకరకాలుగా పిలుస్తున్నారు. ఆయా చిత్రాలను వైరల్‌ చేస్తున్నారు.

బిగ్‌బాస్‌ 4లో మేల్‌ కంటెస్టెంట్లకు చుక్కలు చూపించి టాప్‌ 5లో నిలిచింది అరియానా గ్లోరీ. యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు చేస్తూ పాపులర్‌ అయిన ఈ బ్యూటీ.. ఉన్నట్టుండి భారీ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ పూర్తయిన తర్వాత కూడా పలు టీవీ షోస్‌లో ముక్కు అవినాష్‌తో కలిసి దుమ్ము రేపుతుంది అరియానా.
మరోవైపు గ్లామరస్‌ ఫోటోలతోనూ సందడి చేస్తుంది. తన సన్నని నడుమందాలను చూపిస్తూ హోయలు పోతుంది. తాజాగా ఈ బేబీ పంచుకున్న గ్లామర్‌ పిక్స్ కుర్రాళ్లని గిలిగింతలు పెడుతున్నాయి.

అరియానా బ్లాక్‌ డ్రెస్‌లో వైట్‌ డాట్స్ కలిగిన గౌన్‌లో మెరిసింది అరియానా. తొడ అందాలను చూపిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది.
ఈ సందర్భంగా తన సందేశాన్నిచ్చింది అరియానా. ప్రతి క్షణం బాగా గడుపుతున్నామంటే అది మొత్తం మన క్షేమాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పింది.
గ్రీన్‌ కలర్‌ గౌన్‌లో మెరిసి కుర్రాళ్లని ఫిదా చేసింది అరియానా. ఈ పిక్స్‌ సైతం నెటిజన్లని హంట్‌ చేస్తున్నాయి.
ఈ సందర్బంగా అరియానా చెబుతూ, మనం ఇష్టపడి పని చేయాలని, నచ్చిన, ప్రేమించిన పని చేస్తే పని చేసిన ఫీలింగే ఉండదని చెప్పింది. నచ్చిన పని చేస్తేనే జీవితంలో రాణించగలమని తెలిపింది.
దీంతోపాటు వాయిలెట్‌ కలర్‌ అరియానా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్నాయి. ఇంత అందం ఇన్నాళ్లు ఎక్కడ దాచావ్‌ అంటున్నారు. బార్బీ డాల్‌లా ఉన్నావని కామెంట్‌ చేస్తున్నారు.
ఇక్కడ కూడా తన మెసేజ్‌ని పోస్ట్ చేసింది. ప్రతి ఒక్కరి జర్నీలో ఓ కథ ఉంటుందని, దానికో కారణం ఉంటుందని చెప్పింది. ప్రతి నిర్ణయం వెనకాల ఓ కారణం ఉంటుందని, ఆ విషయాలు ఆలోచించకుండా ఒకేసారి కన్‌క్లూజన్‌కి రావద్దని, కారణాలు తెలుసుకోవాలని, జీవితం వెనకాల ఉన్నరహస్యాలను తెలుసుకోవాలని చెప్పింది. ఇలా తనదైన గ్లామర్‌ ఫోటోలతో, సందేశాలతో నెటిజన్లని ఆకట్టుకుంటుంది అరియానా.

Latest Videos

click me!