కాగా గర్భవతిగా ఉన్నప్పుడు కరోనా బారినపడిన హరితేజ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గర్భవతి ఉండి కరోనా చికిత్స తీసుకోవడం ఆమెకు చాలా కష్టం అయ్యింది. ఆహారం తీసుకోవడానికి ఆమె చాలా అవస్థపడేవారట.
ఇంత కష్టం మధ్య పాపకు జన్మను ఇచ్చిన హరితేజ భయంకరమైన టెన్షన్ అనుభవించారట. పుట్టబోయే పాపకు కూడా పాజిటివ్ వస్తుందేమో అని ఆవేదన చెందారట. అయితే అదృష్టవశాత్తు హరితేజ బిడ్డకు కరోనా నెగిటివ్ గా తేలింది. అయితే 15రోజుల వరకు హరితేజ కన్న కూతురిని వడిలోకి తీసుకోలేకపోయింది.
కాగా హరితేజ తన పాపకు బారసాల ఫంక్షన్ జరిపారు. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు పంచుకున్న హరితేజ కూతురుకి ఏమి పేరు పెట్టారో తెలియజేశారు.
''మా అమ్మా నాన్న నాకు భూమి దీపక్ రావ్ అని పేరు పెట్టారు. అలా అని సహనంగా ఉంటుంది అనుకున్నారు. కోపం వస్తే భూకంపాలు'' మీరు భూమి అని పిలవచ్చు... అంటూ హరితేజ కామెంట్ పెట్టింది. తన కూతురు పేరు భూమి అని అలా రివీల్ చేసింది.
అయితే కూతురు భూమి ముఖాన్ని ఎక్కడా రివీల్ చేయలేదు ఈ జంట. దీనితో హరితేజ కూతురు ఎలా ఉంటుందో చూడాలి అనుకున్నవారికి నిరాశే మిగిలింది.
బుల్లితెర నటిగా అనేక సీరియల్స్ లో నటించిన హరితేజ బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొనడం జరిగింది. ఎన్టీఆర్ హోస్ట్ గా సాగిన ఆ సీజన్ లో హరితేజ బాగానే రాణించారు. ప్రస్తుతం వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు హరితేజ.