ఆసియాలోనే అతిపెద్ద సినిమా స్టూడియో.. చెన్నైలో తెలుగువారు నిర్మించిన అద్భుతం..

First Published | Nov 30, 2024, 5:24 PM IST

ప్రస్తుతం హైదరాబాద్ కు దక్కిన ఘనత.. భారతదేశంలోనే కాదు, ఆసియాలోనే అతిపెద్ద సినిమా స్టూడియో ఒకప్పుడు తమిళనాడు రాజధాని చెన్నైలోనే ఉండేది.

నాగి రెడ్డి

వందేళ్ల చరిత్ర ఉంది తెలుగు,తమిల సినీ పరిశ్రమకు. అంతేకాదు, భారతీయ సినిమా తొలినాళ్లలో, దక్షిణ భారతదేశంలోని అనేక భాషా చిత్రాలలో దాదాపు 90 శాతం షూటింగ్ అప్పటి మద్రాసు నగరంలోనే జరిగేవి. అన్ని భాషల నటులు ఇక్కేడే ఉండేవారు.   1980ల చివరి వరకు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంతో సహా అనేక భాషా చిత్రాల షూటింగ్‌లు 80 శాతం కంటే ఎక్కువ ప్రస్తుత చెన్నైలోనే జరిగాయి. అంతటి ఖ్యాతిని ఆర్జించిన ఒక సినిమా స్టూడియో చెన్నైలో ఉండేది.

విజయా వాహిని స్టూడియో

ఆ సినిమా స్టూడియోనే విజయా వాహిని స్టూడియో. తెలుగు దిగ్గజ నిర్మాత అయిన  నాగిరెడ్డి చెన్నైలో నిర్మించిన "విజయా వాహిని స్టూడియోస్".. నేటికీ చెన్నైలో ఒక గొప్ప ట్రేడ్‌మార్క్‌గా నిలిచింది. ఇప్పుడు చాలా సినిమా స్టూడియోలు వాణిజ్య సముదాయాలుగా, ఆసుపత్రులుగా మారిపోయినా, విజయా వాహిని సినిమా స్టూడియో గొప్పతనం నేటికీ చాలామంది మాట్లాడుకుంటున్నారు.

Latest Videos


సినిమా షూటింగ్

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగిరెడ్డి కుటుంబంలో చాలామంది చెన్నైలో నివసిస్తుండగా, ఉన్నత చదువుల కోసం చెన్నై వచ్చిన ఆయనకు ఈ ప్రాంతం బాగా నచ్చి తన అన్నయ్యతో కలిసి వ్యాపారం చేయాలనుకున్నారు. ఆ తర్వాత నాటకాలపై ఉన్న ఆసక్తితో సినిమా స్టూడియో కట్టాలని ఆశపడి అప్పటి చెన్నైలో ప్రధాన ప్రాంతంగా ఉన్న వడపళనిలో ఒక పెద్ద సినిమా స్టూడియోను నిర్మించారు.

1948లో విజయా ప్రొడక్షన్స్ వాహిని స్టూడియోస్‌తో కలిసి విజయావాహిని స్టూడియోగా మారింది. అప్పట్లోనే దాదాపు 13 అంతస్తుల భవనంలో సినిమా షూటింగ్‌లు జరిగాయి. ఆసియాలోనే అతిపెద్ద సినిమా స్టూడియోగా విజయా వాహిని ఖ్యాతి గాంచింది.

రామోజీ ఫిల్మ్ సిటీ

కానీ ఇప్పుడు విజయా వాహిని వాణిజ్య సముదాయాలుగా, ఆసుపత్రులుగా మారిపోగా, ఆసియాలోనే అతిపెద్ద సినిమా స్టూడియోగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ నిలిచింది. దాదాపు 2000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్టూడియో ఇటీవలే మరణించిన  దిగ్గజ వ్యాపారవెత్త, నిర్మాత రామోజీరావు ఆధ్వర్యంలో నడిచేది. 

సౌత్ లోని అన్ని భాషలు ముఖ్యంగా తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ సినిమాలతో పాటు  బాలీవుడ్‌, హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా 90 శాతం హైదరాబాద్ లో.. అది కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి.  చెన్నైలో విజయవాహిణి కాని.. హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ కాని.. ఆసియాలో అతిపెద్ద స్టూడియోలు నిర్మించిన ఘనత తెలుగువారికే దక్కింది. 

click me!