Allu Arjun: 10 కోట్ల ఆఫర్.. నో చెప్పిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..?

First Published | Dec 16, 2023, 8:38 AM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  ఓ భారీ ఆఫర్ ను వదులుకున్నాడట. దాదాపు 10 కోట్లు విలువైన ప్రాజెక్ట్ ను కాదనుకున్నాడట. ఇంతకీ అల్లు అర్జున్ ఎందుకు ఆ పని చేశారు. కారణం ఏంటి..? 
 

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్లు.. ఒక్క సినిమాల మీదనే ఆధారపడరు.  సాధారణంగా సినిమాల ద్వారా కోట్లకు కోట్లు వస్తున్నా.. వాటితో పాటు.. ఏదో ఒకఉత్పత్తులకు సబంధించిన బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ.. చేతి నిండాసంపాదించుకుంటున్నారు.  ఇండస్ట్రీలో కొనసాగే హీరోలకు ఎంతో మంచి గుర్తింపు వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలి అంటూ స్టార్ హీరోల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే కాకుండా వారికి రెమ్యూనరేషన్ పరంగా కోట్లలో డబ్బులు ఆఫర్ చేస్తూ ఉంటారు. 
 

అయితే ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు బ్రాండ్ ప్రమోషన్ల వల్లనే కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. మరికొంత మంది ఈ విషయంలో వివాదాలు, విమర్షలు కూడా ఫేస్ చేయక తప్పడం లేదు. ఈక్రమంలో ప్రస్తుతం పుష్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సాధించిన అల్లు అర్జున్ కూ కూడా నేషనల్ మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. ఇప్పటికే ఆయన ఎన్నో ఫేమస్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ.. అడ్వటైజ్ మెంట్స్ చేస్తున్నాడు. ఫడ్ యప్స్ కు కూడా బ్రాండ్  అంబాసిడర్ గా ఉన్నారు. 


Allu Arjun

అయితే ఈ బ్రాండ్ ప్రమోషన్ విషయంలో బన్నీ కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. సమాజానికి హాని కలిగించే వాటిని ప్రమోట్ చేయవద్దు అని ఫిక్స్ అయ్యాడు. అందుకే వాటి విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాడు. ఇక  తాజాగా ఈయనకు భారీ ఆఫర్ వచ్చిందట ఏకంగా 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం ఆ ఆఫర్ ను తిరస్కరించాడట. 

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో మందు తాగే సన్నివేశాలలోనూ అలాగే గుట్కా తీసుకునే సమయంలోను కొన్ని కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఈ సినిమాలో నటించాలని ఆయనకు ప్రపోజల్ తీసుకువచ్చారట.ఈ సినిమా సన్నివేశాలలో భాగంగా మందు తాగేటప్పుడు ఆ లిక్కర్ కంపెనీకి సంబంధించినటువంటి లోగోని చూపించడం ఆ కంపెనీలను ప్రమోట్ చేయాలని చెప్పారట.

అంతే కాదు  ఈ విధంగా సినిమాలో  తమ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం కోసం అల్లు అర్జున్ కు ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామని  కంపెనీ   ఆఫర్ చేసిందట. కాని ఈ విషయంలో అల్లు అర్జున్ ఒక్క మాటమీదనే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజల ఆరోగ్యానికి హానికరం చేసే వాటిని తాను ఎప్పుడు ప్రమోట్ చేయనని అల్లు అర్జున్ ఖరా ఖండీగా చెప్పేశారట. అంతే కాదు తనకు వచ్చిన ఈ గోల్డెన్ ఆఫర్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. బన్నీచేసిన మంచి పని తెలిసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. 

ఇప్పటికే పాన్ మసాలా ఆడ్స్ లో నటించిన స్టార్స్ ఇమేజ్ కు డ్యామేజ్ అయ్యింది. కోర్టు నోటీసులు కూడా అందుకున్నారు. అమితాబ్ లాంటివారు కూడా నటించబోయి.. ప్రజా వ్యతిరేకత ను చూసి.. వెనక్కి తగ్గారు. షారుఖ్, అక్షయ్, అజయ్ లాంటి హీరోలు ఇప్పుడు ఈ విషయంలో కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. దాంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చికాకులు పెట్టుకోదలుచుకోలేదు. అందులోను ఇది మంచి పని కాదు అని ఆయన అనుకున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!