బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు లీక్ ? బుల్లితెర క్రేజీ హీరోయిన్లు రంగంలోకి..

Published : Jun 13, 2025, 09:56 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంచ్ డేట్, కంటెస్టెంట్ల వివరాలు లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. 

PREV
15
త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంచ్ ?

ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కింగ్ అక్కినేని నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. నాగార్జున బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ నుంచి హోస్ట్ గా కొనసాగుతున్నారు. తొలి రెండు సీజన్ లకు ఎన్టీఆర్, నాని హోస్ట్ గా వ్యవహరించారు. ప్రస్తుతం షో నిర్వాహకులు సీజన్ 9 కోసం సెట్స్ నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. సెట్స్ పూర్తయ్యాక అధికారికంగా బిగ్ బాస్ 9 లాంచ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 

25
ముహూర్తం కుదిరిందా.. 

అందుతున్న సమాచారం మేరకు, షో 2025 ఆగస్ట్ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతోంది.

35
కంటెస్టెంట్ల పేర్లు లీక్ 

ఇక కంటెస్టెంట్ల విషయానికొస్తే, అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, సోషల్ మీడియా వేదికగా పలు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో తేజస్వినీ, కల్పికా గణేష్, కావ్య, టీవీ ఆర్టిస్ట్ నవ్య స్వామి, టాలీవుడ్ నటుడు ఛత్రపతి శేఖర్, బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ, జ్యోతి రాయ్, సాయికిరణ్, యూట్యూబర్ శ్రావణి వర్మ, ఆర్జే రాజ్ లాంటి వారు బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. 

45
బిజీగా నాగార్జున

ఇక హోస్ట్ నాగార్జున ప్రస్తుతం తన కొత్త చిత్రం 'కుబేరా' ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల తర్వాత ఆయన బిగ్‌బాస్ పనుల్లో పూర్తి స్థాయిలో పాల్గొననున్నట్లు సమాచారం.

55
సీజన్ 9 వైవిధ్యంగా ఉండనుందా.. 

బిగ్‌బాస్ తెలుగు అనేది ప్రతి ఏడాదీ టీవీ ప్రేక్షకులను బాగా ఆకర్షించే షోగా నిలుస్తోంది. ప్రత్యేకంగా సెట్స్, టాస్కులు,సెలబ్రిటీల వ్యక్తిగత అనుభవాలు షోకి మరింత ఆకర్షణను తీసుకువస్తున్నాయి. అయితే ప్రతి సీజన్ లో టాస్కులు రొటీన్ గా మారుతున్నాయి అనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో సీజన్ 9 సరికొత్త అనుభవాన్ని ఇచ్చేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాంటి ప్రణాళికతో వస్తారో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories