మహేష్ బాబు చేయాల్సిన ఆమీర్ ఖాన్ చిత్రం, ఎలా మిస్ అయింది.. చేయకపోవడమే మంచిదైందా ?

Published : Jun 13, 2025, 07:53 PM IST

మహేష్ బాబు గతంలో కొందరు అగ్ర దర్శకులతో కలిసి పనిచేసే అవకాశాన్ని కోల్పోయారు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్, తన దర్శకత్వ ప్రతిభతో క్లాసిక్ చిత్రాలు అందించే మణిరత్నం లతో మహేష్ బాబు గతంలో సినిమాలు చేయాల్సింది.

PREV
15
మహేష్ బాబు తొలి పాన్ ఇండియా చిత్రం 

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. రాజమౌళితో మహేష్ బాబు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే.

25
శంకర్, మణిరత్నం దర్శకత్వంలో..

మహేష్ బాబు గతంలో కొందరు అగ్ర దర్శకులతో కలిసి పనిచేసే అవకాశాన్ని కోల్పోయారు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్, తన దర్శకత్వ ప్రతిభతో క్లాసిక్ చిత్రాలు అందించే మణిరత్నం లతో మహేష్ బాబు గతంలో సినిమాలు చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టులు వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా శంకర్ తో ఒక చిత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాక ఆగిపోయింది.

35
మహేష్ చేయాల్సిన ఆమిర్ ఖాన్ చిత్రం 

బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ చిత్రానికి రీమేక్ తెరకెక్కించాలని శంకర్ భావించారు. త్రీ ఇడియట్స్ రీమేక్ కి హీరోగా శంకర్ ముందుగా అనుకున్నది మహేష్ బాబుని. అంతా ఓకే అనుకున్న టైంలో ఆ మూవీ ఆగిపోయింది.  దీంతో మహేష్ బాబు స్థానంలో దళపతి విజయ్ ఆ చిత్రంలో నటించారు. స్నేహితుడు టైటిల్ తో త్రీ ఇడియట్స్ రీమేక్ రూపొందింది. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీనితో ఆ మూవీలో మహేష్ బాబు నటించకపోవడమే మంచిదైంది అని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. 

45
రీమేక్ చిత్రాలకు దూరం

మహేష్ బాబు తన కెరీర్ లో ముందు నుంచి రీమేక్ చిత్రాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మహేష్ బాబుకి ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి.

55
ఆఫ్రికా అడవుల నేపథ్యంలో..

ప్రస్తుతం మహేష్ బాబు అభిమానులు ఫోకస్ మొత్తం రాజమౌళి చిత్రం పైనే ఉంది. ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ కథాంశంతో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories