రోహిణి సీజన్ 8లో చక్కగా పెర్ఫామ్ చేసింది అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వివాదాల జోలికి ఎక్కువగా వెళ్లకుండా మంచి వినోదం అందించింది అని చెబుతున్నారు. అవినాష్ తో కలసి ఆమె చేసిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. వైల్డ్ కార్డ్స్ వచ్చేవరకు సీజన్ 8 చప్పగా సాగింది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత కాస్త జోష్ పెరిగింది. ఇందులో ముఖ్య పాత్ర పోషించింది రోహిణి, అవినాష్ అని చెప్పొచ్చు.