Bigg boss telugu 8
గత మూడు నెలలుగా సాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. మరో పది రోజుల్లో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోతుంది. ప్రముఖంగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్ నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు. అతడు ఫస్ట్ ఫైనలిస్ట్. అంటే టైటిల్ రేసులో ఉన్నట్లే లెక్క. మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ లో నలుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు.
Bigg boss telugu 8
14వ వారం ఈ సీజన్ కి గాను చివరి నామినేషన్స్ జరిగాయి. గతానికి భిన్నంగా ఈ ప్రక్రియ ముగిసింది. నేరుగా అందరినీ నామినేట్ చేశాడు బిగ్ బాస్. ఇది ప్రజల అభిప్రాయం అన్నారు. అవినాష్ మాత్రమే నామినేషన్స్ లో లేడు. అయితే నామినేషన్ నుండి తప్పించుకునే అవకాశం ఇచ్చాడు. ప్రతి కంటెస్టెంట్ ఎవరు ఫైనల్ కి వెళ్ళకూడదు అనుకుంటున్నారో.. ఆ కంటెస్టెంట్ ఫోటోను కాల్చి.. నామినేట్ చేయాలని ఆదేశించారు.
Bigg boss telugu 8
ఈ క్రమంలో అవినాష్...విష్ణుప్రియ ఫోటో కాల్చి నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. గౌతమ్ ఫోటో కాల్చింది. ఇక గౌతమ్... నిఖిల్ ఫోటో కాల్చేశాడు. వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం నిఖిల్... రోహిణి ఫోటో కాల్చి ఆమెను నామినేట్ చేశాడట. దాంతో నిఖిల్, ప్రేరణ మిగిలారు. వీరిద్దరిలో ఒకరు మాత్రమే నామినేషన్ నుండి మినహాయింపు పొంది ఫైనల్ కి వెళ్తారని బిగ్ బాస్ చెప్పాడు.
వారిద్దరినీ సీక్రెట్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్.. చెరో చెక్ ఇచ్చాడు. అత్యధికంగా రూ. 15 లక్షల వరకు అందులో రాయవచ్చు. ఎవరు ఎక్కువ అమౌంట్ రాస్తారో వారు ఫైనల్ కి వెళతారని చెప్పాడు. వారు రాసిన అమౌంట్ విన్నర్ ప్రైజ్ మనీ నుండి తగ్గిస్తారని కండీషన్ పెట్టాడు. ఇద్దరూ తమ తమ అమౌంట్ రాసి చెక్ కవర్ లో పెట్టారు. అయితే మిగతా హౌస్ మేట్స్ దీన్ని వ్యతిరేకించారు. దాంతో ప్రేక్షకుల ఓట్లతో సేవ్ అవుతామని మాకు నమ్మకం ఉంది. కాబట్టి మేము కూడా నామినేషన్స్ లో ఉంటామని నబీల్, ప్రేరణ చెప్పారు.
Bigg boss telugu 8
కాబట్టి... అవినాష్ తప్పించి అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. గ్రాండ్ ఫినాలేకి వెళ్లే ఛాన్స్ కావడంతో అభిమానులు తమ ఫేవరేట్ కంటెస్టెంట్స్ కి గట్టిగా ఓట్లు వేస్తున్నారు. ఓటింగ్ ట్రెండ్ గమనిస్తే.. గౌతమ్ టాప్ లో ఉన్నాడట. అతడికి 32 శాతం ఓట్లు పోల్ అయ్యాయట. టైటిల్ ఫేవరేట్ గా మొదటి నుండి ప్రచారం అవుతున్న నిఖిల్ రెండో స్థానానికి పరిమితం అయ్యాడట. వీరిద్దరి మధ్య దాదాపు 12 శాతం ఓట్లు తేడా ఉన్నాయని సమాచారం.
ఇక మూడో స్థానంలో ప్రేరణ, నాలుగో స్థానంలో రోహిణి, ఐదో స్థానంలో విష్ణుప్రియ ఉన్నారట.. చివరి స్థానంలో నబీల్ ఉన్నారట. ప్రస్తుతానికి విష్ణుప్రియ, నబీల్ డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిద్దరి మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉందట. మరి ఇదే ట్రెండ్ కొనసాగితే వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయం. అయితే ఓటింగ్ కి ఇంకా సమయం ఉంది. ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో?