నైనికా అనసూరు జీవిత కష్టాలు, తండ్రి ఎంత దారుణం చేశాడంటే.. ఆమె బయోగ్రఫీ గురించి తెలుసా

First Published | Sep 1, 2024, 10:28 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షోలోకి యంగ్ బ్యూటీ అండ్ డ్యాన్సర్ నైనికా ఎంట్రీ ఇచ్చింది. దీనితో ఆమె రియల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు, అనుభవించిన కష్టాలు వైరల్ అవుతున్నాయి.

Nainika Bigg Boss8

నైనికా బయోగ్రఫీ 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షోలోకి యంగ్ బ్యూటీ అండ్ డ్యాన్సర్ నైనికా ఎంట్రీ ఇచ్చింది. దీనితో ఆమె రియల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు, అనుభవించిన కష్టాలు వైరల్ అవుతున్నాయి. అసలు నైనికా ఎవరు ? ఇండస్ట్రీకి ఎలా వచ్చింది ? ఆమె పడ్డ కష్టాలు ఏంటి ? లాంటి విషయాలని ఆమె బియోగ్రఫీ ద్వారా తెలుసుకుందాం. 

తండ్రి చేసిన దారుణం 

నైనికా వాస్తవానికి తెలుగు అమ్మాయి కాదు. ఆమె పుట్టి పెరిగింది ఒరిస్సాలో. జార్స్ గూడ అనే ప్రాంతంలో పుట్టి పెరిగింది. ఆమె వయసు 23 ఏళ్ళు. 2001 ఆగష్టు 27న నైనికా జన్మించింది. పుట్టుకతోనే నైనికాకి కష్టాలు మొదలయ్యాయి. ఆడపిల్ల పుట్టిందని ఆమె తండ్రి నిర్లక్ష్యం చేశారట. తల్లిని తనని అసలు పట్టించుకోలేదు అని నైనికా పలు సందర్భాల్లో తెలిపింది. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి తనని బాల్యంలోనే వదిలేశారని నైనికా పేర్కొంది. 


డ్యాన్స్ అంటే పిచ్చి 

దీనితో నైనికా తన తల్లితో కలసి ఒరిస్సా నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఒరిస్సాలో ఇల్లు కూడా అమ్మేశారు. ఆమె తల్లి ఒక సెలూన్ నడుపుతున్నారట. అయితే నైనికాకి చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే పిచ్చి. డ్యాన్స్ లో తన స్కిల్స్ పెంచుకుంటూ రాటుదేలింది. 

ఢీ షోలో సత్తా 

సినిమాల్లో అవకాశాలు అందుకోవాలని కలలు కంది. ఒక సినిమా ఆడిషన్ కి వెళితే అందులో అప్లికేషన్ ఫామ్ లో అన్ని డీటెయిల్స్ తో పాటు చివర్లో కమిట్మెంట్ కి సిద్ధమా అనే కాలమ్ కూడా ఉందట. అంటే కమిట్మెంట్ ఇస్తే అవకాశం వస్తుంది. అలాంటి ఆఫర్ తనకి వద్దని వెనక్కి వచ్చేసిందట. తన డ్యాన్స్ స్కిల్స్ మీదే ఫోకస్ పెట్టాలని ఢీ షోని ఎంచుకుని అక్కడ సత్తా చాటింది. 

బిగ్ బాస్ తెలుగు 8 లోకి ఎంట్రీ 

ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 8 లో నైనికా అవకాశం దక్కించుకుంది. ఇది ఆమెకి మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ ద్వారా తన క్రేజ్ పెంచుకుని సినిమాల్లో రాణించే అవకాశాలు కూడా పొందొచ్చు. 

Latest Videos

click me!