యాంకరింగ్ నుంచి బిగ్ బాస్ వరకూ.. విష్ణు ప్రియ బయోగ్రఫీ ఇదే..?

First Published | Sep 1, 2024, 10:28 PM IST

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది యాంకర్ విష్ణుప్రియ.. ఈమె పూర్తి పేరు విష్ణుప్రియ భీమినేని. తెలుగు టెలివిజన్ షోల ద్వారా ఈమె ఆడియన్స్‌కి బాగా తెలిసిన ఈ అల్లరి పిల్ల గురించి చూస్తే... 

Vishnu priya bigg Boss8

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది యాంకర్ విష్ణుప్రియ, ప్రకాశం జిల్లా పిల్ల.. విష్ణు ప్రియా 1996 ఆగస్టు 19న హైదరాబాద్‌లో జన్మించింది. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు కాగా.. విష్ణు ప్రియకు చిట్టి చెల్లెలు కూడా ఉంది ఆమె పావని. 28 ఏళ్ల ఈ బ్యూటీ.. చదువుకుంటూ.. మోడల్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆతరువాత టెలివిజన్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. 
 

2017లోసుధీర్ తో కలిసి ఈటీవీలో విష్ణుప్రియ.. పోవే పోరా షో యాంకర్ గా చేసి.. తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పలు తెలుగు, కన్నడ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. చెక్‌మేట్ మూవీలో బోల్డ్‌గా నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. జేడీ చక్రవర్తి యాక్ట్ చేసిన దయా వెబ్ సిరీస్‌లోనూ కీ రోల్‌ ప్లే చేసింది విష్ణు ప్రియ.  
 


Vishnupriya Bhimeneni

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 12వ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన విష్ణు ప్రియా..  టెలివిజన్ స్టార్ గా అద్భుతాలు చేసింది. సోషల్ మీడియాలో ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అంతే కాదు కన్నడ,మలయాళ, సినిమాల్లో కూడా ఆమె నటించి మెప్పించింది. ఇక ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించింది విష్ణుప్రియా. 
 

విష్ణు ప్రియ నటించిన సినిమాలు మలయాళంలొ  మయూఖం (2005), తమిళంలో  శివప్పతిగరం (2006), తెలుగులో యమదొంగ (2007), కన్నడ లొ గూలి (2008).ఇక విష్ణు ప్రియ అభిరుచులు డ్యాన్స్ అంటే ఇష్టం.. వంట చేయడం బాగా ఇష్టం. ఇక విష్ణు మంచి ఫుడి.. ఆమె బాగా తినే ఆహారం చాక్లెట్ దోస. 
 

విష్ణు ప్రియ ఎత్తు 170 సెంటీమీటర్లు. బరువు 58 కేజీలు  ఇక ఆమెకు బాగా ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి తో పాటు పవర్ స్టార్  పవన్ కళ్యాణ ఇష్టమైన హీరోయిన్ అనుష్క. విష్ణు ప్రియకు మ్యూజిక్ వినడం అంటే బాగా ఇష్టం.. ఆమె అభిమానించే మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్. 

Vishnupriya

ఇక విష్ణు ప్రియ రీసెంట్ గా నటుడు మానస్ తో కలిసి ఓ మ్యూజికల్ వీడియో కూడా చేశారు. అయితే ఈమధ్య షోస్ లో ఎక్కువగా కనిపించడంలేదు విష్ణుప్రియ. ఆమధ్య ఎక్కువగా కాంట్రవర్సీలు ఫేస్ చేసింది. ఆమో సోషల్ మీడియా పేజ్ హ్యాక్ అయ్యి.. విష్ణు ప్రియ డీప్ నెక్ ఫోటోస్ వీడియోస్ వైరల్ అయ్యాయి. ఆతరువాత ఆమె పెద్దగా కనిపించడం మానేసింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో సందడి చేయడానికి రెడీ అయ్యింది. 

Latest Videos

click me!