ఎవరీ కిరాక్ సీత ?..పాతిక లక్షల డబ్బు ఆశ పెట్టి వేధించిన నిర్మాత, ఆమె బయోగ్రఫీ ఇదే

First Published | Sep 1, 2024, 9:35 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షోలో తొమ్మిదవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నటి కిరాక్ సీత. కిరాక్ సీత పేరు వినగానే ఆమె యూట్యూబ్ లో చేసే బోల్డ్ వీడియోలే గుర్తుకు వస్తాయి.

kirrak seetha Bigg Boss8

బోల్డ్ వీడియోలు 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షోలో తొమ్మిదవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నటి కిరాక్ సీత. కిరాక్ సీత పేరు వినగానే ఆమె యూట్యూబ్ లో చేసే బోల్డ్ వీడియోలే గుర్తుకు వస్తాయి. దీనితో ఆమె చాలా బోల్డ్, బూతు వీడియోలు చేస్తుంది అనే ముద్ర పడిపోయింది. నెమ్మదిగా టీవీ షోలు, సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంది. 

ఎవరీ కిరాక్ సీత 

ఎన్ని విమర్శలు ఎదురైనా కిరాక్ సీత మాత్రం తన పంథాలో ముందు వెళుతోంది. అసలు ఈ కిరాక్ సీత ఎవరు ? ఎందుకు అంత బోల్డ్ గా మారింది ? ఆమెని ఇలా మార్చేసిన జీవిత సంఘటనలు ఏంటి అనేది ఆమె బయోగ్రఫీలో తెలుసుకుందాం. సీత రాయలసీమకి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి అని సమాచారం. నంద్యాలలో పుట్టి పెరిగిన సీత ఆ తర్వాత హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో స్థిరపడ్డారు. 


సొంతంగా ఎదగాలని.. 

17 ఏళ్ళ వయసు నుంచే తన తల్లిదండ్రులపై ఆధారపడకూడదని ట్యూషన్స్ కూడా చెప్పిందట. సినిమాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయినప్పుడు చాలా కష్టాలు పడిందట. యూట్యూబ్ లో బోల్డ్ గా కనిపించే సీత.. రియల్ లైఫ్ లో అలా కాదు. ఒక ప్రొడ్యూసర్ తనతో గడిపితే పాతిక లక్షలు ఇస్తానని ఆఫర్ కూడా ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. కానీ అలాంటి చెడు నిర్ణయాలు సీత తీసుకోలేదు.. ఆ నిర్మాతకి లొంగలేదు. సీతకి కూచిపూడి, భరత నాట్యంలో కూడా మంచి ప్రావీణ్యం ఉందట. 

ప్రేమించిన వ్యక్తి దూరం 

ముందుగా సీతకి 7 ఆర్ట్స్ లాంటి యూట్యూబ్ వీడియోల్లో అవకాశం వచ్చింది. సరయుతో కలసి చాలా వీడియోలు చేసింది. బోల్డ్ గా, డబుల్ మీనింగ్ తో ఉండే వీడియోలు యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతుంటాయి. ఇక సీతకి లవ్ విషయంలో హార్ట్ బ్రేక్ అయింది. ఒకబ్బాయిని ఐదేళ్లపాటు మనసారా ప్రేమించింది. ఐదేళ్లపాటు ప్రేమించిన వ్యక్తి దూరం అయితే ఎంత నరకమో ఊహించుకోవచ్చు. ఆ బాధ నుంచి బయట పడుతూ సీత తిరిగి తన వర్క్ లో బిజీ అయింది. తాను అప్పుడప్పుడూ మద్యం కూడా సేవిస్తానని సీత బోల్డ్ గా చెప్పింది. 

సినిమాల్లో ఆఫర్స్ 

సీతకి ఇప్పుడిప్పుడే సినిమాల్లో సైతం ఆఫర్స్ వస్తున్నాయి. బ్లాక్ బస్టర్ చిత్రం బేబీ మూవీలో సీత హీరోయిన్ ఫ్రెండ్ గా కీలక పాత్రలో నటించింది. ఆమె పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. సీతకి ట్యాలెంట్ ఉండడంతో మరిన్ని ఆఫర్స్ ఖాయం అని భావించారు. ఈ తరుణంలో తనని తాను నిరూపించుకోవడానికి బిగ్ బాస్ షోకి వచ్చింది. 

హౌస్ లోకి ఎంట్రీ 

బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన సీత నాగార్జునతో తాను ఎదురుకొంటున్న అబ్యూజ్ గురించి ప్రస్తావించింది. అలాంటి పాత్రల్లో నటించినంత మాత్రాన అమ్మాయిలు చెడ్డవాళ్ళు కాదు అని నాగార్జున ఆడియన్స్ కి తెలిపారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో సీత తాను ఎంత స్ట్రాంగ్ పర్సన్ అనేది నిరూపించుకోవడానికి రెడీ అయింది. 

Latest Videos

click me!