Bigg Boss Telugu 9 promo : బిగ్ బాస్ లో మరింత డ్రామాకి దారి తీస్తుందని క్లారిటీగా కనిపిస్తోంది. “చదరంగం అయినా, రణరంగం అయినా… సర్వైవల్‌కి స్ట్రాటజీ మాత్రమే వెపన్ ” అంటూ విడుదలైంది. తాజా బిగ్‌బాస్ ప్రోమో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో మొదటి వారం నామినేషన్లే ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. కామనర్లు, సెలబ్రిటీలు ఇద్దరూ తమ సర్వైవల్ కోసం వ్యూహాత్మకంగా నామినేషన్లు వేస్తుండటంతో హౌస్‌లో ఒక్కసారిగా వాతావరణం మరింత హీటెక్కుతోంది. కంటెస్టెంట్లందరూ తన మైండ్ గేమ్స్ ఆడుతూ హౌస్ ను వార్ రూం గా మర్చేస్తున్నారు. నిజంగా తొలివారం నామినేషన్స్ టాస్క్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా మలుపులు తిరిగింది.
26
భరణి – ఇమ్మానుయేల్ సుత్తి గేమ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో పరిస్థితులు రోజురోజుకి మరింత హీటెక్కుతున్నాయి. “చదరంగం అయినా, రణరంగం అయినా… సర్వైవల్‌కి స్ట్రాటజీ మాత్రమే వెపన్” అంటూ విడుదల చేసిన తాజా ప్రోమో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తాజా ప్రోమోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది సుత్తి గేమ్. భరణి, ఇమ్మానుయేల్ మధ్య టాస్క్. సుత్తి గేమ్‌లో భరణి-ఇమ్మానుయేల్ పోటీపడ్డారు. చివరికి భరణి గెలిచి, తన నామినేషన్ పవర్‌ను ఉపయోగించి సంజనను నామినేట్ చేశాడు. ఆ తర్వాత సుత్తిని శ్రీజకి అందజేశాడు.
36
సంజనపై శ్రీజ ఫైర్
నామినేషన్ రౌండ్‌లో ఎక్కువమంది కంటెస్టెంట్స్ టార్గెట్ చేసిన పేరు సంజనది. మానిటర్ ఇచ్చిన సూచనలు పట్టించుకోకపోవడం, కామనర్స్ తక్కువ చేసి చూడటం ఇవన్నీ ఇతర హౌస్‌మేట్స్‌కు చిరాకు తెప్పించాయి. దీంతో ఆమెపై వరుసగా నామినేషన్లు వచ్చాయి. ఇది గేమ్‌లో సంజనకు పెద్ద సవాలుగా మారింది. ఇక
సుత్తి రాగానే శ్రీజ మొదట సంజనపైనే ఫైర్ అయింది. “బాత్రూంలో షాంపూ బాటిల్ పెట్టడం వల్లే ఇబ్బంది వచ్చింది. మా మాట వినకుండా మీరు మీ స్టాండ్ మీదే ఉన్నారుగా.. అది అసలు స్టాండ్‌యే కాదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆపై తనూజను కూడా నామినేట్ చేస్తూ, ఆమె గత కొన్ని రోజులుగా వేసిన కామెంట్లపై అసహనం వ్యక్తం చేసింది.
ఈ నామినేషన్లలో ఎక్కువ హీటెక్కించిన సన్నివేశం తనూజ చుట్టూ తిరిగింది. ఒకేసారి చాలామంది ఆమెపై ఆరోపణలు చేయడంతో ఆమె ఎమోషనల్ అయింది. “మేమూ మనుషులమే.. ఒక్కసారి చెబితే సరిపోతుంది. కానీ ప్రతి ఒక్కరూ వచ్చి అదే మాటలు చెబితే ఎలా?” అంటూ తాను ఎదుర్కొంటున్న ఒత్తిడిని బయటపెట్టింది. వెంటనే పవన్ మాట్లాడుతూ, “నువ్వు మనుషుల్లా చూడట్లేదు” అని చెప్పడం ఆమెను మరింత నొప్పించారు. మరోపైన హరీష్ కూడా అటాక్ చేశారు. “నీ దయా దాక్షిణ్యాల మీద మేము బతుకుతున్నామా?” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
56
భావోద్వేగానికి లోనైన తనూజ
తనూజ వెంటనే రియాక్ట్ అయ్యింది. “నా బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు” అంటూ కౌంటర్ ఇచ్చింది. నామినేషన్లు ముగిసిన తర్వాత తనూజ సుమన్ శెట్టితో మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకుంది. “నామినేషన్ వల్ల కాదు.. కానీ ఒక ఆడపిల్ల బిహేవియర్ గురించి ఇలా మాట్లాడడం బాధిస్తోంది. బయట ప్రపంచంలో ఇది నా ఇమేజ్‌పై ఎలా ప్రభావం చూపుతుందో భయం వేస్తోంది” అంటూ ఎమోషనల్ అయ్యింది. ఈ సన్నివేశం ఆడియెన్స్ హృదయాలను తాకింది.
66
మాస్క్‌మ్యాన్ – భరణి ఘర్షణ?
మరోవైపు ప్రోమోలో భరణి మాస్క్‌మ్యాన్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఇమ్మానుయేల్ అడ్డుకోవడంతో పెద్ద గొడవ తప్పింది. ఇది రాబోయే ఎపిసోడ్స్‌లో మరింత డ్రామాకి దారి తీస్తుందని క్లారిటీగా కనిపిస్తోంది. “చదరంగం అయినా, రణరంగం అయినా… సర్వైవల్‌కి స్ట్రాటజీ మాత్రమే వెపన్ ” అంటూ విడుదల చేసిన బిగ్‌బాస్ ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నామినేషన్లలో ఎవరెవరు బయటపడతారు? ఎవరి స్ట్రాటజీ వర్కవుట్ అవుతుంది? అన్న ఉత్కంఠతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.