Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్ లో 47వ రోజు కొన్ని ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఇమ్మాన్యుయేల్ కొత్త కెప్టెన్ అయ్యాడు. రీతూ, మాధురి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో భాగంగా 47వ రోజు పెద్ద దుమారమే చెలరేగింది. కొన్ని ఊహించని సంఘటనలు జరిగాయి. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఆయేషా అర్థాంతరంగా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. మాధురి, రీతూ మధ్య మాటల యుద్ధం హద్దులు దాటింది. హౌస్ కి కొత్త కెప్టెన్ గా ఇమ్మాన్యుయేల్ అవతరించాడు. ఇలాంటి విశేషాల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
25
హౌస్ నుంచి ఆయేషా అవుట్
వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఆయేషా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. టాస్క్ లలో కూడా ఆమె పాల్గొనడం లేదు. కాగా ఆయేషాకి టైఫాయిడ్, డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీనితో మెరుగైన వైద్యం కోసం ఆయేషాని హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నట్లు బిగ్ బాస్ తెలిపారు. ఆయేషా అందరికీ గుడ్ బై చెప్పి హౌస్ నుంచి బయటకు వెళ్ళింది.
35
హౌస్ లో పరమ చెత్త కంటెస్టెంట్ నువ్వే
ఇక మనీ విషయంలో రీతూ, పవన్ మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. నేను అడిగితే కానీ నాకు ఇవ్వవా అంటూ పవన్ హర్ట్ అయ్యాడు. నన్ను కావాలనే నెగిటివ్ చేస్తున్నావ్ అంటూ రీతూ చౌదరి కన్నీళ్లు పెట్టుకుంది. రీతూ చౌదరి తన డబ్బుని టీం కోసం కాకుండా పవన్ కోసం ఉపయోగించింది అని మాధురి ఆరోపించారు. ఒక్కసారిగా ఇద్దరి మధ్య వివాదం భగ్గుమంది. ఇద్దరి ఆరోణలు, మాటలు హద్దులు దాటాయి. తన గురించి అనవసరంగా ఆరోపణలు చేయవద్దని రీతూ మాధురికి వార్నింగ్ ఇచ్చింది. మాధురి తగ్గలేదు. ఈ హౌస్ లో పరమ చెత్త కంటెస్టెంట్ నువ్వే అని ఆరోపించింది. నీ నోటికి మించిన చెత్త లేదు అని కామెంట్ చేసింది.
రీతూ ఇండిపెండెంట్ గేమ్ ఆడడానికి రాలేదు.. పవన్ తో ఆడుకోవడానికి వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. దివ్య, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, నిఖిల్, తనూజ, రీతూ కెప్టెన్సీ కంటెండర్లుగా పాల్గొన్నారు. సర్కిల్ మధ్యలో హ్యాట్ ఉంటుంది. బజర్ మోగగానే కెప్టెన్సీ కంటెండర్లు ఆ హ్యాట్ ని దక్కించుకోవాలి. అలా హ్యాట్ ని దక్కించుకున్నవారు మిగిలిన ఇంటి సభ్యులలో తమకి నచ్చిన వారికి ఇవ్వొచ్చు. అలా హ్యాట్ తీసుకున్న సభ్యులు కెప్టెన్సీ కంటెండర్లలో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. అలా చివరికి ఏ కంటెండర్ మిగులుతాడో అతడే విజేత.
55
కొత్త కెప్టెన్ గా ఇమ్మాన్యుయేల్
ఈ టాస్క్ లో ఎక్కువసార్లు ఇమ్మాన్యుయేల్ హ్యాట్ ని చేజిక్కించుకున్నాడు. ఒకసారి ఇమ్మాన్యుయేల్ హ్యాట్ ని సంజనని ఇచ్చాడు. సంజన ఇమ్మాన్యుయేల్ ఇష్టానికి వ్యతిరేకంగా దివ్యని ఎలిమినేట్ చేసింది. మరోసారి ఇమ్మాన్యుయేల్ హ్యాట్ ని మాధురికి ఇచ్చారు. మాధురి నిర్మొహమాటంగా రీతూని ఎలిమినేట్ చేసింది. ఆమె మరొకరిపై ఆధారపడి గేమ్ ఆడుతోంది అని ఆరోపించింది. ఈ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ విజేతగా నిలవడంతో అతడే హౌస్ కి కొత్త కెప్టెన్ అయ్యాడు.