మీరు తోపు అయితే బయట చూసుకోండి, బిగ్ బాస్ హౌస్ లో కాదు.. మాధురికి ఇచ్చిపడేసిన నాగార్జున

Published : Oct 25, 2025, 11:17 PM IST

బిగ్ బాస్ షోలో భాగంగా శనివారం రోజు నాగార్జున కొన్ని నిజాలని నిగ్గు తేల్చారు. తప్పులు చేసిన వారికి తన స్టైల్ లో క్లాస్ పీకారు. ఈ క్రమంలో సంజన, మాధురి లకు కౌంటర్లు పడ్డాయి. 

PREV
15
వివాదాలపై నాగార్జున రివ్యూ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో శనివారం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ వారం హౌస్ లో వివాదాస్పద అంశాలు ఎక్కువగా ఉన్నాయి. నాగార్జున ఏ విషయాన్ని వదలకుండా అన్నింటినీ రివ్యూ చేశారు. తప్పులు చేసిన వారికి నాగ్ తన స్టైల్ లో ఇచ్చిపడేశారు. రీతూ - మాధురి.. సంజన - దివ్య.. తనూజ - రాము ఇలా కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గొడవలని నాగార్జున ప్రస్తావించారు. రీతూ, సంజన మధ్య మాటల యుద్ధం శృతి మించిన సంగతి తెలిసిందే. 

25
మాధురి.. నువ్వు తోపు అయితే బయట చూసుకో.. 

మాధురి టీంలో ఉంటూ డబ్బుని రీతూ పవన్ కి ఇవ్వాలని అనుకోవడం తప్పు అని నాగార్జున అన్నారు. ఒకవేళ అదే ఆమె స్టాండ్ కనుక అయితే ముందుగా మాధురికి చెప్పి ఉండాల్సింది అని నాగార్జున అన్నారు. అలా చెప్పకపోవడం రీతూ తప్పు అని నాగార్జున తెలిపారు. ఈ వివాదంలో మాధురి తప్పు కూడా ఉంది. నేలకేసి కొడతా, నీకంటే హౌస్ లో చెత్త ఎవరూ లేరు అని మాట్లాడడం మాధురి చేసిన తప్పు అని నాగార్జున అన్నారు. ముందు మాట జారింది రీతూనే అని మాధురి వాదించింది. కానీ నాగార్జున వీడియో చూపించి నిజం నిగ్గు తేల్చారు. మాధురి వాదిస్తుండడంతో.. మీరు తోపు అయితే బయట చూసుకోండి.. బిగ్ బాస్ హౌస్ లో కాదు అని ఇచ్చిపడేశారు. 

35
రాముని అసహ్యించుకున్న తనూజ 

రాము దగ్గరకి వచ్చి కూర్చుకుంటే కనీసం మనిషిలా కూడా గౌరవం ఇవ్వకుండా తనూజ అసహ్యించుకుంటూ వెళ్లిపోవడాన్ని నాగార్జున తప్పు పట్టారు. రాము ఒక వేళ డిస్ట్రబ్ చేస్తూ ఉంటే కొంచెం సాఫ్ట్ గా చెప్పాల్సింది అని, అలా అసహ్యించుకుని వెళ్లిపోవడం కరెక్ట్ కాదని నాగ్ అన్నారు. ఆ తర్వాత నాగార్జున సంజనకి ఒక రేంజ్ లో క్లాస్ పీకారు. హౌస్ లో ఆమె మాటలు పరిధి దాటుతున్నాయని వీడియోలు చూపించి మరీ చెప్పారు. 

45
బాడీ షేమింగ్ చేసిన సంజనకి నాగార్జున క్లాస్ 

దివ్యాని రోడ్ రోలర్ అంటూ బాడీ షేమింగ్ చేయడం, చెత్త విషయంలో గొడవ పెట్టుకోవడం లాంటివి కరెక్ట్ కాదని నాగార్జున అన్నారు. సంజనని దివ్యాకి సారీ చెప్పమని నాగార్జున అడిగారు. దీనితో ఆమె సారీ చెప్పింది. కానీ సంజన సారీని దివ్య యాక్సెప్ట్ చేయలేదు. ఆమెకి మాట జారడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు సారీ యాక్సెప్ట్ చేస్తే మరోసారి ఇలాగే మాట్లాడి అప్పుడు కూడా సారీ చెబుతుంది అందుకే ఆమె సారీని యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు అని దివ్య తెలిపింది. 

55
మాధురికి శిక్ష 

హౌస్ మేట్స్ ఇతరుల లోపాలని ఎత్తిచూపుతూ వారి మేడలో బోర్డులు వేశారు. మాధురికి ఇగోయిస్టిక్ లాంటి బోర్డులు వచ్చాయి. మాధురికి అందరికంటే ఎక్కువ బోర్డులు వచ్చాయి. కాబట్టి ఆమెకి శిక్ష ఉంటుంది అని నాగార్జున తెలిపారు. ఇక చివర్లో నామినేషన్స్ లో ఉన్నవారిని నాగార్జున నిలుచోబెట్టారు. కళ్యాణ్, రీతూ, దివ్య, సాయి, తనూజ, రమ్య, రాము, సంజన నామినేషన్స్ లో ఉన్నారు. వారికి బెలూన్స్ ఇచ్చారు. ఎవరి బెలూన్ ని వారు పగలగొట్టారు. కళ్యాణ్ బెలూన్ నుంచి గ్రీన్ కలర్ వచ్చింది. దీనితో కళ్యాణ్ సేఫ్ అయ్యాడు. మిగిలిన వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది సండే తేలనుంది. 

Read more Photos on
click me!

Recommended Stories