Bigg Boss Telugu 9 Grand Finale Guest : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫినాలే కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదరుచూస్తున్నారు. విన్నర్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో గ్రాండ్ ఫినాలే కు ముఖ్య అతిథి ఎవరన్న విషయంలో పెద్ద చర్చ జరుగుతోంది.
అన్ని సీజన్లు ఒక ఎత్తు.. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఒక ఎత్తుగా నిలిచింది. ఈ సీజన్ ఏ స్థాయిలో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సారి అంత పెద్ద సెలబ్రిటీలు లేకున్నా కూడా.. ఎందుకో అన్ని సీజన్ల కంటే.. ఈసీజన్ బిగ్ బాస్ పై ఎక్కువ మంది తెలుగు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. గతంలో ఓ రెండు సీజన్లకు మాత్రమే ఈ రేంజ్ లో రెస్పాన్స్ రాగా.. మళ్లీ ఇన్నేళ్లకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ఆ రేంజ్ లో స్పందన తో పాటు టీఆర్పీ రేటింగ్స్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సీజన్ లో ఇమ్మాన్యుయేల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు.. రీతూ పవన్ ల లవ్ స్టోరీ, సంజనా చేసే పనులు బిగ్ బాస్ లో ప్రత్యేకంగా నిలిచాయి.
26
గ్రాండ్ ఫినాలేకు అంతా రెడీ..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఓటింగ్ భారీ ఎత్తున జరుగుతుంది. హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్లు ఉండగా.. విన్నింగ్ కప్ కోసం హోరా హోరీగా ప్రతీ ఒక్కరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వారం డీమాన్ పవన్ గేమ్ లో చాలా ఛేంజ్ కనిపిస్తోంది. హౌస్ లో ఉన్న 5 మంది తమ స్థానాలను మెరుగు పరుచుకోవడం కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. అంతే కాదు గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ఆసక్తి అందరిలో రోజు రోజుకు పెరుగుతోంది. టైటిల్ ను ఎవరు గెలుచుకుంటారా అని ఉత్కంఠ కూడా పెరిగిపోతోంది. కానీ చాలామంది మాత్రం విన్నర్ ఎవరు అన్న విషయంలో ఒకరివైపే వేలు చూపిస్తున్నారు.
36
టైటిల్ విన్నర్ ఎవరు?
ఇక టైటిల్ విన్నర్ రేస్ విషయానికి వస్తే, నిన్న మొన్నటి వరకు తనూజ, పవన్ కళ్యాణ్ మధ్యనే పోటీ ఉందని అంతా భావించారు. కానీ ఫైనల్ వీక్ లో అనూహ్యంగా ఇప్పుడు డిమోన్ పవన్ కూడా ఈ రేస్‌లో చేరడంతో, ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ ఆదివారం ట్రోఫీ గెలుచుకోనున్నారు. గతంలో పవన్ ప్లేస్ లో ఇమ్మాన్యూయెల్ పేరు వినిపించేది. కానీ పరిస్థితి మారిపోయింది. చివరి నిమిషం వరకు విజేత ఎవరో అన్న ఉత్కంఠ కొనసాగనుంది. అయితే ఎక్కువ మంది మాత్రం కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ అని గట్టిగా ప్రనాచారం చేస్తున్నారు. ఓటింగ్ కూడా కళ్యాణ్ కే ఎక్కువ ఉండటంతో.. విన్నర్ కళ్యాణ్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా, ఈ సీజన్ ఇంత పెద్ద హిట్ కావడంతో గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథి ఎవరు అన్న విషయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకూ మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాడ్ ఫినాలేకు ముఖ్య అతిధిగా రాబోతున్నట్టు ప్రచారం జరిగింది. గతంలో రెండు సీజన్లకు ఆయనే వచ్చి.. విన్నర్ కు కప్ అందించాడు. ఈసారి కూడా చిరంజీవి మన శంకరవరప్రసాదుగారు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ ఫినాలేకు రాబోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది. ఈసీజన్ ఎండ్ కు గెస్ట్ గా మరో పెద్ద హీరో రాబోతున్నట్టు తెలుస్తోంది.
56
గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా యంగ్ రెబల్ స్టార్..
చిరంజీవి ఇప్పటికే రెండు సార్లు బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. మళ్లీ ఆయన్నే పిలిస్తే ప్రేక్షకులకు రొటీన్ ఫీలింగ్ కలుగుతుందేమో అన్న ఆలోచనతో, ఈసారి రెబల్ స్టార్ ప్రభాస్‌ను గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘రాజా సాబ్’ వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను ఫినాలేకు పిలిస్తే, సినిమాకు ప్రమోషన్ కూడా జరిగినట్లవుతుందనే ఆలోచనతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
66
గత సీజన్ లో ముఖ్య అతిథులుగా..
గత సీజన్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఇప్పటికే మూడు సార్లు బిగ్ బాస్ షోకు వచ్చారు. ప్రభాస్ బిగ్ బాస్ వేదికపై కనిపించడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం. మరి ఇందులో ఎంత వరకూ నిజమో తెలియాల్సి ఉంది.