అవసరం కొద్దీ మనుషులకు దగ్గర అవుతుంది, తనూజ అంటే నాకు చిరాకు.. భరణికి దివ్య క్లాస్

Published : Nov 20, 2025, 11:05 PM IST

బిగ్ బాస్ తెలుగు 9లో 74వ రోజు భరణి, దివ్య, తనూజ మధ్య పెద్ద హైడ్రామా సాగింది. భరణి కూతురు హౌస్ లోకి వచ్చి దివ్యకి చెప్పిన మాటలు వైరల్ అయ్యేలా ఉన్నాయి. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9

 బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. వరుసగా కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 74వ రోజు మరికొందరు కుటుంబ సభ్యులు హౌస్ లో సందడి చేశారు. ముందుగా కళ్యాణ్ తల్లి లక్ష్మి వచ్చారు. కొడుకుతో సరదాగా కాసేపు ఆమె మాట్లాడారు. ఆ తర్వాత ఇంటి సభ్యులతో కూడా ముచ్చటించారు.  తనూజ ఆమెకి చీరని గిఫ్ట్ గా ఇచ్చారు. తన తల్లి హౌస్ ని వీడి వెళ్లిన తర్వాత కళ్యాణ్ తనూజని ప్రశ్నించాడు. మా అమ్మకి చీర ఎందుకు ఇచ్చావు అని అడిగాడు. 

25
తనూజ, భరణి, దివ్య మధ్య హైడ్రామా 

తనూజ సమాధానం ఇస్తూ ఒక ఫ్యామిలీ మెంబర్ లా భావించి ఇచ్చినట్లు తనూజ పేర్కొంది. అందులో మరో ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత భరణి, తనూజ, దివ్య మధ్య పెద్ద హైడ్రామా సాగింది. భరణి.. తనూజ లెగ్ కి మసాజ్ చేశాడు. అది చూసి దివ్య భరించలేకపోయింది. మీరు ఎందుకు తనూజ కాలుకి మసాజ్ చేశారు అని దివ్య భరణిపై ఫైర్ అయింది. తనూజ నీకు నచ్చడం లేదా అని భరణి అడిగారు. తనూజ కూడా దివ్య అలా బిహేవ్ చేస్తోంది ఏంటి ? అని ఆశ్చర్యపోయింది. 

35
తనూజ అంటే నాకు చిరాకు 

ఆ తర్వాత దివ్య భరణితో మాట్లాడుతూ.. మీకు బుర్రలేదు. మీ గురించి మీరు ఆలోచించుకోరా అని ప్రశ్నించింది. తనూజ తన కన్వీనియన్స్ ప్రకారం, అవసరం కొద్దీ మనుషులకు దగ్గర అవుతుంది. అలాంటి వాళ్ళంటే నాకు చిరాకు అని దివ్య సమాధానం ఇచ్చింది. ఇంతలో రీతూ తల్లి కూడా హౌస్ లోకి వచ్చారు. ఇంటి సభ్యులని పలకరించిన ఆమె.. ఇక నాలుగు వారాలే ఉంది.. గట్టిగా ఆడాలి అని కూతుర్ని మోటివేట్ చేసింది. 

45
హౌస్ లోకి భరణి కూతురు 

ఆ తర్వాత అందరినీ సర్ప్రైజ్ చేస్తూ భరణి చిన్న కూతురు హారతి హౌస్ లోకి వచ్చారు. స్టోర్ రూమ్ ద్వారా ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రాగానే తండ్రిని గట్టిగా కౌగలించుకుని ఎమోషనల్ అయింది. హౌస్ లో అందరినీ పరిచయం చేసుకుంది. 

55
నాన్నని కమాండ్ చేయొద్దు 

తనూజ గురించి ప్రత్యేకంగా చెప్పింది. హౌస్ లో నాన్నతో మీ బాండింగ్ మాకు ఫేవరిట్ అని పేర్కొంది. దివ్యని మాత్రం ప్రత్యేకంగా పిలిచి ఒక మాట చెప్పింది. మీరు నాన్నకి హెల్త్ బాగా లేనప్పుడు బాగా చూసుకున్నారు. మీరంటే మాకు ఇష్టం. కానీ నాన్నతో అలా కమాండింగ్ గా బిహేవ్ చేయొద్దు ప్లీజ్ అని రిక్వస్ట్ చేసింది. ఇకపై అలా బిహేవ్ చేయను అని దివ్య భరణి కూతురుకి మాట ఇచ్చింది. హారతి హౌస్ నుంచి వెళుతూ.. నిన్ను కమాండ్ చేసే వాళ్ళ పట్ల సాఫ్ట్ గా ఉండొద్దని ఫైర్ చూపించండి అని తండ్రితో చెప్పింది. 

Read more Photos on
click me!

Recommended Stories