బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలై రెండు వారాలు అవుతుంది. షో అంత రసవత్తరంగా లేదు. కంటెస్టెంట్స్ అందరూ చప్పగా ఉన్నారు. వీరిలో గేమ్ లేదు, ఫైర్ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫస్ట్ వీక్ టీఆర్పీ ఆశించిన స్థాయిలో లేదట. సెకండ్ వీక్ లో టీఆర్పీ మరింత తగ్గే సూచనలు కలవు.
షోని రంజుగా మార్చాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు స్ట్రాంగ్ గా ఉండాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ క్రమంలో కొత్త వాళ్ళను కాకుండా మాజీ కంటెస్టెంట్స్ ని రంగంలోకి దింపుతున్నారట. ఈ లిస్ట్ లో హరి తేజ, రోహిణి, శోభా శెట్టి, అవినాష్, టేస్టీ తేజ ఉన్నారట.
హరి తేజ మొదట్లో పలు సీరియల్స్ లో నటించింది. అనంతరం సిల్వర్ స్క్రీన్ పై అవకాశాలు రాబట్టింది. ముప్పైకి పైగా సినిమాల్లో హరి తేజ నటించింది. జబర్దస్త్ లేడీ కమెడియన్ గా ఫేమ్ రాబట్టింది రోహిణి. గతంలో రోహిణి సీరియల్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు వెండితెరపై సత్తా చాటుతుంది. రోహిణికి కమెడియన్ గా వరుస అవకాశాలు వస్తున్నాయి. రోహిణి బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్ట్ చేసింది.