Bigg Boss Telugu 7: ఓటింగ్ లో భారీ ట్విస్ట్... ఫస్ట్ వీకే ఇంటిదారి పట్టనున్న టాప్ కంటెస్టెంట్!

బిగ్ బాస్ తెలుగు 7 మొదటి ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. ఓ టాప్ సెలబ్రిటీ హౌస్ వీడటం ఖాయం అంటున్నారు. 
 

bigg boss telugu 7 this top contestant to eliminate in first week ksr

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu 7)రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్ వీక్ ముగియగా ఎలిమినేషన్ కి సమయం ఆసన్నమైంది. 14 మంది కంటెస్టెంట్స్ తో సెప్టెంబర్ 3న బిగ్ బాస్ తెలుగు 7 ప్రారంభమైంది. నాగార్జున వరుసగా ఐదోసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 
 

సోమవారం-మంగళవారం రెండు రోజులు నామిషన్స్ ప్రక్రియ సాగింది. ఎప్పటిలానే ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ని తగు కారణాలు చెప్పి ఎలిమినేషన్ కి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. మెజారిటీ కంటెస్టెంట్స్ నామినేట్ చేసిన 8 మంది ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు.


Bigg Boss Telugu 7

శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ, షకీలా, దామిని, రతికా రోజ్, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్ నామినేట్ అయ్యారు. మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఆడియన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్స్ కి ఓట్లు వేసి ఎలిమినేషన్ నుండి కాపాడవచ్చు. 
 

Bigg Boss Telugu 7

శుక్రవారంతో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అందుతున్న సమాచారం ప్రకారం అత్యధిక ఓట్లు పల్లవి ప్రశాంత్ కి దక్కాయట. ఏకంగా మొత్తం ఓట్లలో 40% పల్లవి ప్రశాంత్ కి పోల్ అయ్యాయట. రైతు బిడ్డగా అతడికి సింపతీ బాగా వర్క్ అవుట్ అవుతుందని సమాచారం. పల్లవి ప్రశాంత్ అనంతరం రతికా రోజ్ కి అత్యధిక ఓట్లు పడ్డాయట. 
 

Bigg Boss Telugu 7

మొదట్లో శోభా శెట్టి రెండో ప్లేస్ లో ఉండగా రతికా తన గేమ్ తో ఆమెను వెనక్కి సెటైర్ రెండో స్థానం కైవసం చేసుకుందట. మూడో ప్లేస్ లో శోభా శెట్టి ఉండగా, నాలుగో స్థానంలో గౌతమ్ కృష్ణ, ఐదో స్థానంలో షకీలా కొనసాగుతున్నారట. ఇక ఆరో స్థానంలో ప్రిన్స్ యావర్, ఏడో స్థానంలో దామిని, చివరి స్థానంలో కిరణ్ రాథోడ్ ఉన్నారట.


అందరికంటే అతి తక్కువ ఓట్లతో కిరణ్ రాథోడ్ డేంజర్ జోన్లో ఉన్నారట. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనే అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7లో ఎలిమినేట్ అయ్యే తొలి కంటెస్టెంట్ కిరణ్ రాథోడ్ అంటున్నారు. ఒకప్పుడు కిరణ్ రాథోడ్ సౌత్ లో టాప్ యాక్ట్రెస్. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. 

ప్రస్తుతం హౌస్లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్స్ కంటే పేరున్న నటి. హౌస్లో సంచలనాలు చేస్తుందనుకుంటే ఆమె ఫస్ట్ వీకే వెళ్ళిపోతుందని అంటున్నారు. అయితే ఒక్కోసారి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండదు. అదే సమయంలో షో కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది. కాబట్టి ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం.... 
 

Latest Videos

vuukle one pixel image
click me!