బిగ్ బాస్ లవర్స్...  సీజన్ 7లో మైండ్ బ్లాక్ చేసే ఈ అరుదైన రికార్డులు గమనించారా?

Published : Oct 31, 2023, 05:02 PM ISTUpdated : Oct 31, 2023, 05:31 PM IST

బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్లో కొన్ని అరుదైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  కొన్ని రేర్ రికార్డ్స్ నమోదయ్యాయి. షాక్ ఇచ్చే ఆ విషయాలు ఏమిటో చూద్దాం...   

PREV
18
బిగ్ బాస్ లవర్స్...  సీజన్ 7లో మైండ్ బ్లాక్ చేసే ఈ అరుదైన రికార్డులు గమనించారా?

గత సీజన్లో ఎన్నడూచూడని రికార్డులు బిగ్ బాస్ తెలుగు 7లో నమోదయ్యాయి. వాటిలో ఒకటి  వరుసగా ఏడుగురు అమ్మాయిలు ఎలిమినేట్ కావడం. గత ఆరు సీజన్స్ లో  వరుసగా ఇంత మంది లేడీ హౌస్ మేట్స్ ఇంటిని వీడిన దాఖలాలు లేవు. అత్యధికంగా ముగ్గురు అమ్మాయిలు వరుసగా ఎలిమినేట్ అయిన రికార్డు ఉంది. 

28

సీజన్ 7లో మొదటిగా కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. అనంతరం షకీలా, దామిని, రతిక రోజ్, శుభశ్రీ, పూజ మూర్తి ఎలిమినేట్ అయ్యారు. వీరిలో రతిక రోజ్ లక్కీగా రీఎంట్రీ ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె హౌస్లో ఉంది. 

 

38

మరో రికార్డు ఏమిటంటే... ఒక కంటెస్టెంట్ ఏడు వారాలు నామినేషన్స్ లో లేకపోవడం. సందీప్ ఈ రికార్డు నెలకొల్పాడు. సందీప్ మొదటివారమే పవర్ అస్త్ర గెలుచుకున్నాడు. ఫస్ట్ పవర్ అస్త్ర పొందిన సందీప్ కి ఐదు వారాల ఇమ్యూనిటీ లభించింది. దాంతో ఐదు వారాలు అతన్ని నామినేట్ చేయడానికి వీల్లేకుండా పోయింది. 

48

6వ వారం సందీప్ నామినేట్ అయ్యాడు. సీక్రెట్ రూమ్ నుండి బయటకు వచ్చిన గౌతమ్ కి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఆ పవర్ ఉపయోగించి సందీప్ ని నామినేషన్స్ నుండి సేవ్ చేశాడు. ఇక 7వ వారం ఒక్కరు మాత్రమే నామినేట్ చేశారు. సింగిల్ ఓటు పడినవారిని నామినేషన్స్ లోకి తీసుకోలేదు. 8వ వారం నామినేటైన సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. 

58

మరో అరుదైన విషయం ఏమిటంటే... ఒక్కరు తప్ప తేజ నామినేట్ చేసిన వారందరూ ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్ ని నామినేట్ చేశాడు. ఆమె ఎలిమినేట్ అయ్యింది. రెండో వారం ప్రశాంత్ ని చేయగా అతడు బ్యాడ్ సెంటిమెంట్ ని ఎదిరించి నిలిచాడు. ఎలిమినేట్ కాలేదు. 

 

68

తర్వాత తేజ నామినేట్ చేసిన దామిని, రతిక, శుభశ్రీ, నయని పావని, పూజ మూర్తి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. కాబట్టి తేజా నామినేట్ చేస్తే ఆ వారం వాళ్లకు మూడిందే అన్నట్లు పరిస్థితి తయారైంది.

78
Bigg Boss Telugu 7

మరో రికార్డు ఏమిటంటే...కెప్టెన్ గౌతమ్ లేడీ కంటెస్టెంట్స్ కి వర్క్ నుండి రిలీఫ్ ఇవ్వడం. నా కెప్టెన్సీలో అమ్మాయిలు పని చేయాల్సిన అవసరం లేదని గౌతమ్ నిర్ణయం తీసుకున్నాడు. బిగ్ బాస్ షో చరిత్రలో మొదటిసారి కెప్టెన్ లేడీస్ కి వన్ వీక్ వర్క్ నుండి విరామం ఇచ్చాడు. మరో రికార్డు ఏమిటంటే...కెప్టెన్ గౌతమ్ లేడీ కంటెస్టెంట్స్ కి వర్క్ నుండి రిలీఫ్ ఇవ్వడం.

88

ఈ వారం మొత్తం అమ్మాయిలు కిచెన్‌లో వర్క్ చేయొద్దు అనే నిర్ణయం ఇప్పుడు గౌతమ్‌ని ప్రత్యేకంగా మార్చింది. ఈ ఒక్క నిర్ణయంతో అందరిని దృష్టిని ఆకర్షించాడు గౌతమ్‌. ముఖ్యంగా అమ్మాయిల మనసులను గెలుచుకున్నాడు. వారి నుంచి గౌతమ్‌కి మద్దతు పెరుగుతుంది. ఇతర ఏ భాష బిగ్‌ బాస్‌ షోలోనూ ఇలాంటి నిర్ణయాలు జరగలేదు, ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. దీంతో గౌతమ్‌ ఇప్పడు బిగ్‌ బాస్‌ హౌజ్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎంట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. అంతేకాదు హౌజ్‌లో డేర్‌గా నిర్ణయాలు తీసుకుంటూ బిగ్‌ బాస్‌ హౌజ్‌ తీరుతెన్నులనే మార్చేస్తుండ

click me!

Recommended Stories